500 కోట్ల 'బాహుబలి-2'
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా అంటే సరికొత్త అర్థం చెబుతూ బాహుబలి రెండో పార్ట్ `బాహుబలి -2` బాక్సాఫీస్ వద్ద స్టామినాను చాటుతుంది. కొత్త కొత్త రికార్డులను తెర తీస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదలైన ఈ సినిమా తొలి మూడు రోజుల్లో 505 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్నీభాషల్లో కలిపి 385 కోట్ల రూపాయలను కలెక్ట్ చేయగా, ఓవర్సీస్లో 128 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ముఖ్యంగా బాలీవుడ్లో తొలి మూడు రోజుల్లో 128 కోట్ల రూపాయలను వసూలు చేయడంతో అప్పటి వరకు ఉన్న అమీర్ ఖాన్ దంగల్ 107.01 కోట్లు, సల్మాన్‌ఖాన్ సుల్తాన్ 105.53 కోట్ల రూపాయల వసూళ్ళను దాటేసింది.
సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసిన రాజమౌళి ట్విట్టర్లో స్పందించాడు. ఈ ఐదేళ్ళ బాహుబలి ప్రయాణంలో తోడుగా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు, జీవితాంతం మా గుండెల్లో దాచుకునేంత గొప్ప విజయాన్ని అందించారని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com