బాహుబలి 2 స్టార్ట్ అయ్యింది
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి 2 స్టార్ట్ అయ్యింది...అనగానే బాహుబలి 2 షూటింగ్ స్టార్ట్ అయ్యిందనుకుంటే పొరపాటే. అసలు విషయం ఏమిటంటే..రాజమౌళి తన టీంకి బాహుబలి 2 కథ చెప్పడం స్టార్ట్ చేసారట. అది విషయం. ఈ విషయాన్ని బాహుబలి చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. బాహుబలి చిత్రం చూసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక డౌట్. ఒక డౌట్ కాదు. చాలా డౌట్స్ ఉన్నాయి.
ఈ విషయం రాజమౌళి దగ్గర ప్రస్తావిస్తే అందరి డౌట్స్ కి బాహుబలి 2లో సమాధానం దొరుకుతుందన్నారు. బాహుబలి 2 కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారంటే...బాహుబలి 2 కధ చెబుతున్నారని శోభు యార్లగడ్డ చెప్పారో లేదో...కథ ఎక్కడ చెబుతున్నారో అడ్రస్ చెప్పండి...ఐదు నిమిషాల్లో ఉంటాం అంటున్నారు సినీ ప్రియులు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. బాహుబలి 2 కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com