చైనాపై బాహుబలి దండయాత్ర
Send us your feedback to audioarticles@vaarta.com
చైనా బాక్సాఫీస్ వద్ద దంగల్ యుద్ధం చేస్తూ 500 కోట్లను దాటి 1000 కోట్లను చేరువ అవుతుంది. ఈ యుద్ధం ముగిసే లోపలే, చైనాపై బాహుబలి దండయాత్ర మొదలుకానుంది. దంగల్తో పోటీ పడుతూ బాహుబలి-2 కలెక్షన్స్ సునామీని క్రియేట్ చేయడానికి సిద్ధమవుతుంది. బాహుబలి-2 ఇంగ్లీష్ వెర్షన్ను విడుదల చేయడానికి రాజమౌళి అండ్ టీం సిద్ధమవుతోంది.
బాహుబలి2 వ్యవథి దాదాపు 170 నిమిషాలు ఉంటుంది. కానీ హాలీవుడ్ రూల్స్ ప్రకారం ఇప్పుడు నిడివిని 150 నిమిషాలకు తగ్గిస్తున్నారు. ఇందు కోసం హాలీవుడ్ ఎడిటర్స్ వర్క్ చేస్తున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారక సమాచారం రానుంది. ఇండియాలో తిరుగులేని రికార్డులు క్రియేట్ చేసిన బాహుబలి2 చైనాలో ఎలాంటి సెన్సేషన్స్కు తెర తీయనుందో మరి..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com