'బాహుబలి 2 - ది కంక్లూజన్' ఆ ఫీట్ సాధిస్తుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
జాతీయ స్థాయిలో వసూళ్ళ వర్షం కురిపించిన చిత్రం ‘బాహుబలి 2 - ది కంక్లూజన్’. ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టిన ఈ సినిమా.. శుక్రవారం చైనాలో విడుదలైంది. చైనీస్ బాక్సాఫీస్ వద్ద తొలి రెండు రోజులు 5.54 మిలియన్ డాలర్ల (రూ.37కోట్ల) వసూళ్లు రాబట్టి తన హవాను చాటుకుంది. ఈ లెక్కన మొదటి వారాంతానికి $7.5 మిలియన్లకి పైగా వసూళ్లు చేసే అవకాశం ఉందనీ.. ఫుల్ రన్లో $20 - $30 మిలియన్లు రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం చైనీస్ బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ ఫిల్మ్ ‘దంగల్’ రూ. 386.33 కోట్ల కలెక్షన్లతో తొలి స్థానంలో ఉంది. ‘బాహుబలి 2’ ఈ రికార్డును అందుకోవాలంటే కనీసం 60 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టాలి. అయితే.. ఈ నెల 11న ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ చైనాలో రిలీజ్ కాబోతోంది. అలాగే చైనా స్థానిక సినిమాలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘బాహుబలి 2’ ఈ ఫీట్‌ను అందుకోవడంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com