'బాహుబలి 2 - ది కంక్లూజ‌న్‌' ఆ ఫీట్ సాధిస్తుందా?

  • IndiaGlitz, [Monday,May 07 2018]

జాతీయ స్థాయిలో వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించిన చిత్రం ‘బాహుబలి 2 - ది కంక్లూజ‌న్‌’. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.1600 కోట్ల‌కి పైగా గ్రాస్ రాబ‌ట్టిన ఈ సినిమా..  శుక్రవారం  చైనాలో విడుద‌లైంది. చైనీస్ బాక్సాఫీస్ వద్ద  తొలి రెండు రోజులు 5.54 మిలియ‌న్ డాల‌ర్ల  (రూ.37కోట్ల) వసూళ్లు రాబట్టి తన హవాను చాటుకుంది. ఈ లెక్కన మొదటి వారాంతానికి  $7.5 మిలియన్లకి పైగా వసూళ్లు చేసే అవకాశం ఉందనీ.. ఫుల్ ర‌న్‌లో  $20 - $30 మిలియన్లు రాబ‌ట్ట‌వ‌చ్చ‌ని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం చైనీస్ బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ ఫిల్మ్ ‘దంగల్’ రూ. 386.33 కోట్ల కలెక్షన్ల‌తో తొలి స్థానంలో ఉంది.  ‘బాహుబలి 2’ ఈ రికార్డును అందుకోవాలంటే కనీసం 60 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టాలి. అయితే.. ఈ నెల 11న  ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ చైనాలో రిలీజ్ కాబోతోంది. అలాగే చైనా స్థానిక సినిమాలు ఉండ‌నే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో    ‘బాహుబలి 2’ ఈ ఫీట్‌ను అందుకోవడంలో ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

More News

అఖిల్ సినిమాకి కూడా అలాగే చేస్తున్న ద‌ర్శ‌కుడు

‘తొలిప్రేమ’ సినిమాతో టాలీవుడ్‌లోకి దర్శకుడిగా అడుగుపెట్టి ఘ‌న‌విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు వెంకీ అట్లూరి.

వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్ 'ఎఫ్ 2' ప్రారంభం

విభిన్న‌మైన సినిమాలు, పాత్ర‌లు చేస్తూ కొత్త‌దనానికి పెద్ద పీట వేసే స్టార్ హీరో విక్ట‌రీ వెకంటేశ్‌...

ఫాస్‌ ఫిలిం సొసైటీ - దాసరి సినీ అవార్డుల ప్రధానోత్సవం

దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సేవలందిస్తున్న ఫిలిం ఎనాలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ(ఫాస్‌) - దాసరి 2018 ఫిలిం అవార్డులను మే 6న హైదరాబాద్‌లోని

మే 12 నుండి బ్యాంకాక్‌లో రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను చిత్రం

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో

జూన్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా 'టిక్ టిక్ టిక్‌' గ్రాండ్ రిలీజ్‌

జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో