క్లైమాక్స్ ప్లానింగ్ లో బాహుబలి 2 టీమ్..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాహుబలి చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న బాహుబలి 2 టీమ్ సమ్మర్ సందర్భంగా సెలవు తీసుకుంది. ఇక సమ్మర్ హాలీడేస్ పూర్తవ్వడంతో మళ్లీ వర్క్ స్టార్ట్ చేసారు.
ఈ సందర్భంగా బాహుబలి టీమ్ ట్విట్టర్ లో స్పందిస్తూ.... క్లైమాక్స్ కోసం ప్లాన్ చేస్తున్నాం. సమ్మర్ బ్రేక్ అయిపోయింది. తిరిగి వర్క్ చేసే టైమ్ ఇది అంటూ రామోజీ ఫిలింసిటీలో రాజమౌళి, సెంథిల్ కుమార్, లీ విట్టేకర్, అశ్విన్ గంగరాజు తదితరులు వర్క్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసారు. బాహుబలి సినిమా ఎవరు ఊహించని విధంగా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వసూలు చేసింది. మరి...బాహుబలి 2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com