'బాహుబలి 2' భారీ షెడ్యూల్..
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం స్రుష్టించడంతో బాహుబలి 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు దీటుగా బాహుబలి 2ను తెరకెక్కించేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు జక్కన్న. డిసెంబర్ 14 నుంచి బాహుబలి 2 షూటింగ్ ప్రారంభించనున్నారు. రామోజీ ఫిలింసిటీలో జరిగే ఈ షెడ్యూల్ చాలా చిన్నదట.
సంక్రాంతి నుంచి భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దాదాపు 80 % షూటింగ్ రామోజీ ఫిలింసిటీలోనే ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన 20% షూటింగ్ కోసం లోకేషన్స్ సెర్చ్ చేస్తున్నారు. బాహుబలికి చివరిలో ఇంటర్నేషనల్ టీమ్ తో వర్క్ చేసారు. ఇప్పుడు బాహుబలి 2 కి ప్రారంభం నుంచే ఇంటర్నేషనల్ టీమ్ తో వర్క్ చేస్తుండడం విశేషం. ఏమాత్రం రాజీపడకుండా ఇంటర్నేషనల్ టీమ్ తో వర్క్ చేస్తుండడంతో బాహుబలి 2 కి అనుకున్న దాని కన్నా ఎక్కువ బడ్జెట్ అవుతుంది. బాహుబలి ని మించిన బడ్జెట్ తో రూపొందుతున్న బాహుబలి 2 ఏరేంజ్ కలెక్షన్స్ సాధిస్తుందో..ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments