జోరు తగ్గ‌ని 'బాహుబ‌లి 2'

  • IndiaGlitz, [Sunday,May 06 2018]

గత సంవత్సరం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించి 1700 కోట్లకుపైగా వసూళ్ళు సాధించింది ‘బాహుబలి 2’. ఈ శుక్రవారం ‘బాహుబలి 2’ చైనాలో 7 వేల థియేటర్లలో విడుదలైంది. ‘బాహుబలి’ మొదటి భాగం చైనాలో ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. రెండో భాగం విషయంలో అలా జరగకూడదని భావించిన చిత్ర యూనిట్ హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చైనా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మరోసారి ఎడిట్ చేయించారు.

ఇది బాగానే వర్కవుట్ అయింది. ‘బాహుబలి 2’ తొలిరోజు 2.85 మిలియన్ డాలర్లు(19 కోట్ల రూపాయలు) కలెక్ట్ చేసింది. ‘బాహుబలి’ చైనాలో ఫుల్న్‌ల్రో 1.18 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ‘బాహుబలి 2’ తొలిరోజే రెట్టింపుకుపైగా కలెక్ట్ చేయడం విశేషం. అంతే కాకుండా చైనాలో ఘనవిజయం సాధించిన దంగల్, భజరంగీ బాయ్‌జాన్ సినిమాల తొలి రోజు కలెక్షన్ రికార్డులను ఈ సినిమా అధిగమించింది. తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. రెండు రోజుల్లో 37 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేయ‌డం విశేషం. 

More News

నాదెండ్లగా సచిన్

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

'సవ్యసాచి' వాయిదా పడుతోందా?

నాగ చైతన్య, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’.

హార్రర్ కామెడీ గా 'వస్తా'

భానుచంద‌ర్‌, జీవా, అదిరే అభి, ఫ‌ణి ప్ర‌ధాన తారాగ‌ణంగా మెట్రో క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రూపొందుతోన్న సినిమా `వ‌స్తా`.

డ‌బ్బింగ్ చెప్పుకుంటున్న అదితిరావ్ హైద‌రి

‘చెలియా’ సినిమాలో నటించి మంచి మార్కులనే సంపాదించుకుంది హైదరాబాదీ అమ్మాయి అదితిరావు హైదరి.

జూన్ 1న 'రాజు గాడు' విడుదల

యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న "రాజుగాడు"