జోరు తగ్గని 'బాహుబలి 2'
Send us your feedback to audioarticles@vaarta.com
గత సంవత్సరం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించి 1700 కోట్లకుపైగా వసూళ్ళు సాధించింది ‘బాహుబలి 2’. ఈ శుక్రవారం ‘బాహుబలి 2’ చైనాలో 7 వేల థియేటర్లలో విడుదలైంది. ‘బాహుబలి’ మొదటి భాగం చైనాలో ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. రెండో భాగం విషయంలో అలా జరగకూడదని భావించిన చిత్ర యూనిట్ హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చైనా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మరోసారి ఎడిట్ చేయించారు.
ఇది బాగానే వర్కవుట్ అయింది. ‘బాహుబలి 2’ తొలిరోజు 2.85 మిలియన్ డాలర్లు(19 కోట్ల రూపాయలు) కలెక్ట్ చేసింది. ‘బాహుబలి’ చైనాలో ఫుల్న్‌ల్రో 1.18 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ‘బాహుబలి 2’ తొలిరోజే రెట్టింపుకుపైగా కలెక్ట్ చేయడం విశేషం. అంతే కాకుండా చైనాలో ఘనవిజయం సాధించిన దంగల్, భజరంగీ బాయ్‌జాన్ సినిమాల తొలి రోజు కలెక్షన్ రికార్డులను ఈ సినిమా అధిగమించింది. తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. రెండు రోజుల్లో 37 కోట్ల రూపాయలను వసూలు చేయడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout