'బాహబలి 2' మరో రికార్డ్
Send us your feedback to audioarticles@vaarta.com
`బాహుబలి 2` విడుదలై ఏడాది దాటి పోతున్న ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలస్తుంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ వంటి ప్రధాన తారాగణంతో రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటింది. హిందీ సినిమా మార్కెట్‌తో పోటీ పడి 1600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది.
ఇప్పుడు సినిమా జపాన్‌లో కూడా వంద రోజులు పూర్తి చేసుకుని మరో రికార్డ్‌ను క్రియేట్ చేసుకుంది. ఓ తెలుగు సినిమా జపాన్‌లో వంద రోజులు రన్ కావడం గొప్పే మరి. అంతే కాకుండా ఈ రన్లో 1.3 మిలియన్ డాలర్స్‌ను రాబట్టుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com