'బాహుబలి 2' నైజాం బిజినెస్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా బాహుబలి2- ది కన్‌క్లూజన్. ప్రభాస్, రాజమౌళి, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రానా, రమ్యకృష్ణ, నాజర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ చిత్రం పార్ట్ 1, 600 కోట్ల కలెక్షన్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఇప్పుడందరూ బాహుబలి2 ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని ఈ చిత్రంతో దర్శకుడు రాజమౌళి ఇంట్రడ్యూస్ చేస్తుడటంతో సినిమా మార్కెట్ పెరిగిందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఉన్న లెక్కలు ప్రకారం బాహుబలి2 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
బాహుబలి2ను ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నారు...రిలీజ్ కు ముందు నుండే అన్నీ ఎరియాస్‌లో బిజినెస్ అదరగొడుతుంది. అందులో భాగంగా రీసెంట్ యు.ఎస్, కెనడాల్లో తెలుగు, తమిళం, మలయాళ హక్కులను గ్రేట్ ఇండియా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 45 కోట్ల రూపాయలను చేజిక్కించుకుందని సమాచారం. తాజా సమాచారం ప్రకారం నైజాం ఏరియా హక్కులను ఏషియన్ ఫిలింస్ వారు 45 కోట్లను వెచ్చించి కోనుగోలు చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. మరి కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో చూడాల్సిందే...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com