వెయ్యి కోట్లకు చేరువలో 'బాహుబలి-2'
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచానికి తెలుగు సినిమా స్టామినాను తెలియజేసిన చిత్రం `బాహుబలి-2` ముఖ్యంగా అన్నీ బాలీవుడ్ చిత్రాల రికార్డులను బద్ధలు కొట్టి నెంబర్ వన్ గ్రాసర్‌గా నిలిచింది. సినిమా విడుదలైన వారం రోజుల్లోనే అన్నీ సినిమాల రికార్డులను కొల్లగొట్టడంతో అందరి దృష్టిని ఆకర్షించింది ఎందుకంటే సినిమా 1000 కోట్లకు చేరువ అవుతుండటమే అందుకు కారణం. సినిమా 860 కోట్ల గ్రాస్‌ను సాధించింది.
అందులో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా 695 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేస్తే, ఓవర్సీస్లో 165 కోట్ల రూపాయల గ్రాస్‌ను సాధించింది. సెకండ్ వీక్‌లో కూడా బాహుబలి-2 హవా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ఇదే ఊపుతో కొనసాగితే సినిమా 1200 గ్రాస్ టచ్ చేస్తుందని, అందులో ఎటువంటి సందేహం లేదని అంటున్నారు. బాలీవుడ్ చిత్రాలకంటే కంటే కూడా అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com