బాహుబలి 2 మేకింగ్ వీడియో రిలీజ్ డీటైల్స్..!
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం బాహుబలి 2. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న బాహుబలి 2 లోగోను ఇటీవల రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక బాహుబలి 2 ఫస్ట్ లుక్ & మేకింగ్ వీడియోను ప్రభాస్ పుట్టినరోజు కానుక గా ఒక రోజు ముందుగా అనగా ఈనెల 22న రిలీజ్ చేయనున్నారు.
ఈ వీడియోను ముంబాయి ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగమైన మూవీ మేళ అనే కార్యక్రమంలో ఈ వీడియోను రిలీజ్ చేయనున్నారు. ఈ మేకింగ్ వీడియోను విఆర్ (వర్చువల్ రియాలిటి) కార్డ్ బోర్డ్ సామర్ధ్యం ఉన్న స్మార్ట్ ఫోన్ లో చూడవచ్చు. అయితే...ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్న 500 మంది ప్రభాస్ వీరాభిమానులకు ఈ వీడియోను ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తున్నట్టు నిర్మాత శోభు యార్లగడ్డ తెలియచేసారు. ఈ సంచలన చిత్రాన్ని ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments