బాహుబలి 2 లోకేషన్ ఫోటోస్ లీక్..!
Tuesday, September 20, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు సినిమా బాహుబలి. దర్శకధీర రాజమౌళి బాహుబలి చిత్రానికి సీక్వెల్ గా బాహుబలి 2 రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న బాహుబలి 2 కోసం ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరించారు. ఇంకా క్లైమాక్స్ సీన్స్ కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే...ఎన్నిరకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా..
ఈ సినిమాకి సంబంధించి ఏదో రకంగా ఏదొకటి లీక్ అవుతునే ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన లోకేషన్ స్టిల్స్ లీకయ్యాయి. లీకైన ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. భారీ లోయలో జరుగుతున్న షూటింగ్ లో యుద్ధ పరికరాలను సిద్దం చేస్తున్నట్టుగా ఈ స్టిల్స్ ను చూస్తే తెలుస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న బాహుబలి 2 చిత్రాన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments