2 డేస్ లేటుగా బాహుబలి 2..
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకథీర రాజమౌళి తెరకెక్కించిన వెండితెర అద్భుతం బాహుబలి. తెలుగులో రూపొందిన బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 600 కోట్లు వసూలు చేసి సంచలనం స్రుష్టించిన విషయం తెలిసిందే.బాహుబలి క్రియేట్ చేసిన సెన్సేషన్ తో బాహుబలి 2 ఎప్పుడు వస్తుందా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
అయితే బాహుబలి 2 షూటింగ్ ఈ నెల 14 నుంచి ప్రారంభించాలి. కానీ కొన్ని కారణాల వలన ఈ నెల 16 నుంచి అంటే 2 డేస్ లేటుగా ప్రారంభిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్ లో ఈ షూటింగ్ చేయనున్నారు. బాహుబలి 1 మించి బాహుబలి 2 ఉండేలా కథలో మార్పులు చేసారు. ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతం అనేలా ప్లాన్ చేసారట. పక్కా ప్లాన్ తో రూపొందుతున్న బాహుబలి 2...బాహుబలి 1 రికార్డులను మించేలా కలెక్షన్స్ సునామి స్రుష్టిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments