ఆ దేశంలోనే బాహుబలి-2 ఇండస్ట్రీ హిట్
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్స్ సాధిస్తున్న చిత్రంగా దూసుకెళుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆసక్తికరమైన విషయమేమంటే ఇండియాలోనే కాదు, నేపాల్లో కూడా బాహుబలి-2 సెన్సేషనల్ వసూళ్ళను సాధిస్తూ ముందుకెళుతుంది. నేపాలీలో ఇప్పటికే ఈ సినిమా పది కోట్ల రూపాయలను వసూళు చసేసిందట. ఇప్పటి వరకు నేపాల్లో అత్యధికంగా వసూలు చేసిన సినిమా `చక్కా పంజా`. ఈ సినిమా 17 కోట్ల గ్రాస్ సాధించిన చిత్రంగా నెంబర్ వన్ ప్లేస్లో ఉంది. బాహుబలి-2 ఈ రికార్డును మరో వారంలో క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు బావిస్తున్నాయి. బాహుబలి-2 ఇండియాలోనే కాదు, నేపాల్లో కూడా ఇండస్ట్రీ హిట్ సాధించనుందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com