భారీ రేటుకు 'బాహుబలి2' హిందీ శాటిలైట్ హక్కులు...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా బాహుబలి2- ది కన్‌క్లూజన్. ప్రభాస్, రాజమౌళి, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రానా, రమ్యకృష్ణ, నాజర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ చిత్రం పార్ట్ 1, 600 కోట్ల కలెక్షన్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఇప్పుడందరూ బాహుబలి2 ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని ఈ చిత్రంతో దర్శకుడు రాజమౌళి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. దీంతో తెలుగు సినిమా మార్కెట్‌ను ఇంకా విస్తృతం చేయడానికి అవకాశం ఉనట్లే. కాగా ఈ సినిమా ఏప్రిల్ 28 2017న విడుదల కానుంది. డిసెంబర్ రెండో వారానికంతా సినిమా షూటింగ్ పూర్తవుతుంది. సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్, సీడెడ్, నైజాంల్లో రికార్డు స్థాయి బిజినెస్‌ను పూర్తి చేసుకుంది.
తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులను సోనీ టీవీ 51 కోట్ల రూపాయలను చెల్లించి సొంతం చేసుకుందని వార్తలు వినపడుతున్నాయి. ఓ తెలుగు అనువాద చిత్రానికి హిందీలో ఈ రేంజ్ మార్కెట్ క్రియేట్ అవుతుందంటే చిన్నవిషయం కాదు. బాహుబలి 2 విడుదల తర్వాత ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com