1500 కోట్ల 'బాహుబలి-2'
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు ప్రేక్షకుడంటే కమర్షియల్ సినిమాలను ఆదరించే ప్రేక్షకుడని, కొత్తదనానికి పెద్ద పీట వేయడని, దర్శకుల ఆలోచనలు, హీరోల ఆలోచనలు పరిమితంగానే ఉంటాయనే ఆలోచనలను తిరగరాసిన సినిమా `బాహుబలి-2`. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి రెండు పార్టులుగా తెరకెక్కింది.
పార్ట్1గా విడుదలైన బాహుబలి ది బిగినింగ్ ఆరు వందల కోట్ల రూపాయలను వసూళు చేసి ఇండియన్ సినిమా దృష్టిని ఆకర్షిస్తే, పార్ట్ 2గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి-2 బాలీవుడ్ స్టార్స్ నటించిన అన్నీ సినిమాల దుమ్ము దులేపేసి ఏకంగా 1500 కోట్ల క్లబ్లో చేరింది. ఇండియన్ సినిమా కలెక్షన్స్‌లో కనివినీ ఎరుగని రీతిలో కలెక్షన్స్ రావడం ఇండియన్ సినిమానే కాదు, ప్రపంచ సినిమానే ఆకట్టుకుంది బాహుబలి-2. పది రోజుల్లో 1000 కోట్లు సాధించిన ఈ చిత్రం 22 రోజుల్లో 1500 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఇండియాలో 1227కోట్ల రూపాయలను వసూలు చేసిన ఈ చిత్రం ఓవర్సీస్లో 275 కోట్ల రూపాయలను వసూలు చేయడం విశేషం. హిందీ వెర్షన్లో 500కోట్ల రూపాయలను సాధించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout