పీకేను దాటేసిన 'బాహుబలి-2'
Send us your feedback to audioarticles@vaarta.com
విడుదల రోజు కంటే ముందు రోజు నుండి భారీ అంచనాలు మధ్య విడుదలైన విజువల్ గ్రాఫిక్స్ వండర్ `బాహుబలి-2` అందరి అంచనాలను మించుతూ ముందుకు సాగుతుంది. తెలుగు, తమిళం, మలయాళంలో విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా విడుదలైన అన్నీ భాషల్లో సెన్సేషన్ వసూళ్ళను రాబడుతుంది. ఇప్పటి వరకు అమీర్‌ఖాన్ నటించిన పీకే సినిమా లైఫ్ టైం గ్రాస్ కలెక్షన్స్ 745 కోట్ల రూపాయలు. దీన్ని `బాహుబలి-2` కేవలం ఆరు రోజుల్లోనే అధిగమించడం విశేషం.
ఆరు రోజుల్లో `బాహుబలి-2` 785 కోట్ల గ్రాస్‌ను సాధించడం విశేషం. అన్నీ భాషల్లో ఇండియా మొత్తంగా 630 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం ఓవర్సీస్లో 155 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో ఆల్ ఓవర్ ఇండియాలో నెంబర్ వన్ గ్రాసర్‌గా నిలిచింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com