రికార్డుల బాహుబలి..

  • IndiaGlitz, [Saturday,April 29 2017]

విడుద‌ల‌కు ముందే బాహుబ‌లి 2 సెన్సేష‌న్స్ క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. విడుద‌ల త‌ర్వాత కూడా బాహుబ‌లి 2 వ‌సూళ్ళ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. గురువారం రాత్రి నుండే పెయిడ్ ప్రీమియ‌ర్స్‌తో కలెక్ష‌న్స్ ర‌న్ స్టార్ట్ చేసిన బాహుబ‌లి 2 శుక్ర‌వారం నాటికి ఆ ఉధృతిని ఎక్కువ చేసుకుంటుంది. ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్న దాని ప్ర‌కారం తొలి రోజునే సినిమా ఇండియాలోనే 125 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించింది. అయితే అన‌ధికారకంగా ఈ లెక్క 150 కోట్ల పైమాటేనంటున్నారు.
ఆంధ్ర‌, తెలంగాణ రాష్ట్రాల్లో 55 కోట్లు, హిందీలో 38 కోట్లు, కర్ణాటకలో 12 కోట్లు, కేరళలో 9 కోట్లు, తమిళనాట 11 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా తెలుస్తోంది.ఓవ‌ర్‌సీన్ క‌లెక్ష‌న్స్‌తో స‌హా చూస్తే మొత్తం 150 కోట్ల‌ను దాటేసిన‌ట్టే. మొత్తం ర‌న్‌లోనే 100 కోట్లు దాటితేనే రికార్డులు అంటున్న త‌రుణంలో తొలిరోజునే 100 కోట్లు క‌లెక్ష‌న్స్ రావ‌డం కూడా రికార్డే. సినిమా మొత్తం ర‌న్‌లో 1000 కోట్లు క‌లెక్ట్ చేస్తుంద‌ని అన్నారు.