వ‌చ్చే నెల‌లో బాహుబ‌లి 2 వ‌స్తున్నాడు..!

  • IndiaGlitz, [Thursday,January 19 2017]

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి 2. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతున్నబాహుబ‌లి 2 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఏప్రిల్ 28న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే... ఈనెల‌లో బాహుబ‌లి 2 ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు గ‌తంలో రాజ‌మౌళి ప్ర‌క‌టించారు. అయితే...షూటింగ్ కాస్త ఆల‌స్యం అవ్వ‌డం వ‌ల‌న ట్రైల‌ర్ రిలీజ్ కూడా లేట్ అవుతుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఫిబ్ర‌వ‌రి ప్ర‌ధ‌మార్ధంలో ట్రైల‌ర్ ను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రైల‌ర్ లాంఛ్ చేయ‌డానికి రాజ‌మౌళి టీమ్ భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. బాహుబ‌లి సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో బాహుబ‌లి 2 పై అటు ఆడియోన్స్ లో, ఇటు ఇండ‌స్ట్రీలో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి..అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు బాహుబ‌లి 2 రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ సాధించి ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.