బాహుబలి 2 బల్లాల దేవ ఫస్ట్ లుక్ రిలీజ్..!
Wednesday, December 14, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి సినిమాలో బల్లాల దేవ పాత్రలో నటించి జాతీయ స్ధాయిలో విశేష గుర్తింపు పొందిన నటుడు రానా. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి 2 చిత్రాన్ని ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. ఈరోజు బల్లాల దేవ అదే దగ్గుబాటి రానా పుట్టినరోజు. ఈ సందర్భంగా నిన్న ఘాజీ చిత్రంలో రానా నావెల్ ఆఫీసర్ గెటప్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ రోజు దర్శకధీరుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా బాహుబలి 2 లో రానా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. బాహుబలి చిత్రంలో కంటే ఎక్కువ క్రూరత్వంతో ఉన్నట్టుగా రానా స్టిల్ చూస్తుంటే తెలుస్తుంది. యుద్ధరంగంలో గద పట్టుకుని సీరియస్ గా చూస్తున్న ఈ స్టిల్ చూస్తుంటే...బాహుబలి 2లో రానా రోల్ ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో అర్ధం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించేందుకు బాహుబలి 2 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments