'బాహుబలి-2' ఆడియో లాంచ్ డేట్...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా స్టామినాని దేశానికే కాదు, ప్రపంచానికి తెలియచెప్పిన సినిమా బాహుబలి. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమా పార్ట్1 సెన్సేషనల్ హిట్ అయ్యి ఆరు వందల కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించింది. ఇప్పుడు అందరూ బాహుబలి పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వర్చువల్ రియాలిటీలో ఏప్రిల్ 28న బాహుబలి 2 విడుదల కానుంది.
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ సహా పలువురు తారాగణంగా నటించిన ఈ సినిమా విడుదల దగ్గర పడుతుంటే, సినిమా ప్రమోషన్స్‌కు రంగం సిద్ధం చేస్తుంది. ముందుగా ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. అలాగే ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలను ఈసారి హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో నిర్వహిస్తారట. పార్ట్-1 ఆడియో వేడుకను తిరుపతిలో నిర్వహించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com