'యాత్ర'లో 'బాహుబలి 2' యాక్ట్రస్
Send us your feedback to audioarticles@vaarta.com
సమైక్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'ఆనందో బ్రహ్మ' సినిమాతో ఆకట్టుకున్న మహి వి.రాఘవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. వై.ఎస్.ఆర్.పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా.. వై.ఎస్.ఆర్. సతీమణి విజయమ్మగా నయనతారను ఎంపిక చేసినట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి.
అలాగే.. రమ్యకృష్ణ, రాధికా ఆప్టే పేర్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. 'బాహుబలి 2'లో "కన్నా నిదురించరా" అనే పాటలో అనుష్కతో పాటు కనిపించిన నర్తకి అశ్రిత వేముగంటిని.. తాజాగా విజయమ్మ పాత్రకోసం సంప్రదించినట్టు తెలుస్తోంది.
స్వతహాగా నృత్య కళాకారిణి అయిన అశ్రిత ఇప్పుడు ఈ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంటే.. ఈమె కెరీర్ ఊపందుకున్నట్టే అని పలువురు భావిస్తున్నారు. మరి ఈమెనైనా నిర్మాతలు ఫైనల్ చేస్తారో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments