'యాత్ర'లో 'బాహుబలి 2' యాక్ట్ర‌స్‌

  • IndiaGlitz, [Sunday,April 29 2018]

సమైక్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'ఆనందో బ్రహ్మ' సినిమాతో ఆకట్టుకున్న మహి వి.రాఘవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఎం.ఎం.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన‌ ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. వై.ఎస్.ఆర్.పాత్రలో మల‌యాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటిస్తుండగా.. వై.ఎస్.ఆర్. సతీమణి విజయమ్మగా నయనతారను ఎంపిక చేసినట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి.

అలాగే.. రమ్యకృష్ణ, రాధికా ఆప్టే పేర్లు కూడా వినిపిస్తున్న  నేపథ్యంలో ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. 'బాహుబలి 2'లో కన్నా నిదురించరా అనే పాటలో అనుష్కతో పాటు కనిపించిన నర్తకి అశ్రిత వేముగంటిని.. తాజాగా విజయమ్మ పాత్రకోసం సంప్రదించినట్టు తెలుస్తోంది.

స్వతహాగా నృత్య కళాకారిణి అయిన అశ్రిత ఇప్పుడు ఈ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంటే.. ఈమె కెరీర్ ఊపందుకున్నట్టే అని పలువురు భావిస్తున్నారు. మరి ఈమెనైనా నిర్మాతలు ఫైనల్ చేస్తారో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

More News

'యముడికి మొగుడు'కి 30 ఏళ్ళు

ధర్మాన్ని పాటించే యమధర్మరాజు తప్పు చేస్తే ఎలా ఉంటుంది అన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రమే 'యముడికి మొగుడు'.

ర‌వితేజ హీరోయిన్ వైపే మొగ్గు చూపుతున్న రామ్‌

ఎన‌ర్జిటిక్‌ స్టార్ రామ్ హీరోగా పి.ఎస్‌.వి. గ‌రుడ‌వేగ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

వెంకీతో కామెడీ చేయ‌నున్న అన‌సూయ‌

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా  'ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' పేరుతో ఓ మల్టీస్టారర్ మూవీ  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో సుమంత్‌

గత ఏడాది విడుద‌లైన‌ 'మళ్ళీ రావా' చిత్రం విజయంతో మ‌రోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కేసారు హీరో సుమంత్. ఆ చిత్రంలో కార్తీక్‌గా సుమంత్ నటన పలువురి ప్రశంసలు అందుకుంది.

పారితోషికం తీసుకోకుండా నటిస్తున్న సమంత

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'యు టర్న్'. రెండేళ్ళ క్రితం కన్నడంలో విడుదలైన 'యు టర్న్' మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.