సెంటర్స్ లోనూ బాహుబలి 50 డేస్ రికార్డ్
Send us your feedback to audioarticles@vaarta.com
మహా అద్భుతాన్ని వెండితెరపై ఆవిష్కరించాలనే ఓ దర్శకుడి కల నిజమైంది. తెలుగు చిత్రసీమ అంటే ఎంతో ఘన చరిత్ర ఉంది. కానీ అప్పటి వరకు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ అనుకునేవారు. కానీ బాలీవుడ్‌కు ధీటుగా సినిమాలు చేస్తున్న దర్శకులున్నారంటూ ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన విజువల్ వండర్ బాహుబలి. తెలుగువాడి సత్తా అంటే ఇదంటూ ప్రపంచానికి చాటిన బాహబలి సినిమా వెనుక ఎంతో మంది కష్టం ఉంది.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, యంగ్రెబల్స్టార్ ప్రభాస్‌లు వీరిలో ముందున్నారు. ఐదేళ్ళపాటు ఒకే సినిమాను ఓ వండర్లా చూపించాలని రాజమౌళి, దర్శకుడి తపననను అర్థం చేసుకుని మరే సినిమా చేయకుండా డేడికేషన్‌తో సినిమాకే అంకితమై పోయి వెండితెర బాహుబలి అంటే ప్రభాస్ తప్ప మరేవరూ ఆ పాత్రలో చేయలేరనేలా ఒదిగిపోయాడు మన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. వీరి కలలను సాకారం చేసేలా వెన్నుదన్నుగా నిలవడమే కాకుండా అన్ కాంప్రమైజ్డ్గా సినిమాను నిర్మించారు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని.కథను, దర్శకుడిని, హీరోను నమ్మి తెలుగు సినిమాయే కాదు, దేశంలో అప్పటి వరకు ఏ నిర్మాత సాహసం చేయని విధంగా చేసి 400 కోట్ల రూపాయలతో సినిమాను నిర్మించారు. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి2 రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం తెలుగులోనే కాదు, ఇండియాలోనే ఏ సినిమా కనువినీ ఎరుగని రీతిలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. బాహుబలి మేనియా ఎంతలా చొచ్చుకెళ్ళిందంటే.. ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో ఇండియన్ ఆటగాళ్ళైనా ధోని, విరాట్ కోహ్లిలను బాహుబలి పోల్చుతూ బొమ్మలను ప్రదర్శించారు. అలాగే ఓ విదేశీ యువతి బాహుబలిలోని దండాలయ్యా..పాటను ఏ తప్పులు లేకుండా పాడటం విశేషం. ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా ఐదేళ్ళ పాటు బాహుబలి మానియా దేశాన్ని ఊపేసింది.
అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, భళ్ళాలదేవగా రానా దగ్గుబాటి, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్, బిజ్జలదేవుడిగా నాజర్ ఇలా ప్రతి పాత్ర పోటీ పడి నటించడంతో వెండితెర అద్భుతం ఆవిష్కరించిన తీరుకి ఇండియన్ సినీ ప్రపంచమే కాదు, వరల్డ్ సినిమా సైతం కూడా భళిరా బాహుబలి.. సాహోరే రాజమౌళి అంటూ బాహుబలికి కలెక్షన్స్‌తో నీరాజనం పట్టింది. కలెక్షన్స్ పరంగా చూస్తే బాహబలి ది బిగినింగ్ ఆరు వందల కోట్లకు పైగా వసూళ్ళను సాధిస్తే, బాహుబలి 2 ఏకంగా 1700 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను సాధించి ఇండియన్ మూవీ హిస్టరీలోనే మరే సినిమా సాధించని వసూళ్ళను సాధించి ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను సాధించింది బాహుబలి 2. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన బాహుబలి-2 విడుదలైన అన్నీ భాషల్లో రికార్డ్స్ కలెక్షన్స్‌ను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతుంది.
50 డేస్..రికార్డ్ సెంటర్స్
ఇప్పటి వరకు భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఏ సినిమా సాధించని నెంబర్ ఆఫ్ సెంటర్స్‌లో 50 డేస్‌ను పూర్తి చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 282 సెంటర్స్, నార్త్ ఇండియా 491 సెంటర్స్, ఓవర్సీస్ 25 సెంటర్స్, తమిళనాడు 120 సెంటర్స్, కర్ణాటక 54 సెంటర్స్, కేరళ 102 సెంటర్స్ కలిపి మొత్తంగా 1074 సెంటర్స్‌లో అర్ధ శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి వంద రోజులను మెరెన్ని సెంటర్స్‌లో సాధిస్తుందో చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments