యు.ఎస్. బాక్సాఫీస్ వద్ద మూడోస్థానంలో 'బాహుబలి -2'
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్, రాజమౌళి కాంబోలో రూపొందిన విజువల్ వండర్ బాహుబలి రెండో పార్ట్ `బాహుబలి-2` ఏప్రిల్ 28న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు, తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో కనువిని ఎరుగని రీతిలో కలెక్షన్స్‌ను సాధిస్తూ బాలీవుడ్ చిత్రాలకు ధీటుగా ముందుకు సాగిపోతుంది. యు.ఎస్‌లో అయితే హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా నిలబడుతుంది.
శుక్ర, శని, ఆదివారంతో కలిపి 10.13 మిలియన్ డాలర్స్‌ను సాధించింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 64 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. యు.ఎస్. బాక్సాఫీస్ వీకెండ్ లిస్టులో మొదటి మూడు చిత్రాల్లో బాహుబలి -2 ఒకటిగా నిలిచింది. మొదటగా పేట్ ఆఫ్ ఆఫ్ ది ఫ్యూరియస్ 19.3 మిలియన్ డాలర్స్‌తో మొదటిస్థానంలో నిలిచింది. 12 మిలియన్ డాలర్స్‌తో హౌ టు బి ఏ లాటిన్ లవర్ రెండో స్థానంలో నిలిచింది.
యు.ఎస్ చిత్రాలతో పోటీ పడుతూ ఓ తెలుగు సినిమా రేసులో ముందు రావడం తొలిసారి కావడం విశేషమే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout