'బాఘీ 3' వామ్మో ఇవేం ఫైట్స్‌ రా బాబోయ్!

  • IndiaGlitz, [Thursday,February 06 2020]

బాలీవుడ్‌ నటుడు టైగర్‌ష్రాప్‌ హీరోగా ఇప్పటికే బాఘి, బాఘి 2 చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్‌ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకున్నాయి. తాజాగా ఈ ప్రాంఛైజీలో బాఘి 3 చిత్రం వస్తోంది. ష్రాప్ కెరీర్‌లో ‘బాఘి’ బ్లాక్ బస్టర్ సిరీస్‌గా నిలిచిపోయింది. బాఘీ-3లో టైగర్‌కు జోడీగా మరోసారి శ్రద్ధా కపూర్ నటించారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ గురువారం నాడు రిలీజ్ అయ్యింది.

కథేంటి!?

03:41 నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్‌లో సినిమా రేంజ్‌ ఏంటి..? ఏ రేంజ్‌లో తెరకెక్కించారు..? సినిమా ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు చూపించేశాడు. మరీ ముఖ్యంగా దీన్ని బట్టి చూస్తే బడ్జెట్‌కు నిర్మాత ఏ మాత్రం వెనుకాడలేదని స్పష్టంగా అర్థమైంది. రితీష్‌ దేశ్‌ముఖ్‌ సోదరుడి పాత్రలో టైగర్ నటించాడు. రితీష్ పోలీస్ ఆఫీసర్ కావడంతో అతడ్ని ఉగ్రమూకల నుంచి ఎలా రక్షించాడు..? సిరియాలో ఉగ్రవాదులను టైగర్ ఎలా ఏరిపారేశాడన్నదే స్టోరీ. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయ్.!

హైలైట్స్ ఏంటి..!?

ట్రైలర్‌ మొత్తమ్మీద ఫైట్స్‌ హైలెట్.. అస్సలు ఇలాంటి ఫైట్స్‌ బహుశా బాలీవుడ్‌లో ఇదివరకు వచ్చిన సినిమాల్లో లేవ్.. ఇక ముందు కూడా రావేమో. ఫైట్స్ పరంగా టైగర్ ఈ సినిమాతో రికార్డ్ క్రియేట్ చేసుకోబోతున్నాడు. మరీ ముఖ్యంగా టైగర్ దేహదారుడ్యం చూస్తే బాప్ రే అనక మానరు. అతని బాడీకి తగ్గట్టుగానే సన్నివేశాలు, ఫైట్స్ సీన్స్ కంపోజ్ చేశారని చెప్పుకోవచ్చు. నిజంగా ఇలాంటివి హాలీవుడ్‌లో మాత్రమే సాధ్యం అవుతాయేమో కానీ బాలీవుడ్‌లో అసాధ్యం. కార్లపై ఎగురుకుంటూ వెళ్లి కొట్టడం.. మార్షల్ ఆర్ట్స్‌లో దిట్ట అయిన టైగర్.. వామ్మో ఇవేం ఫైట్స్ రా బాబోయ్ అనిపించేశాడు.! మొత్తానికి చూస్తే సినిమాకు రితీష్ పాత్రే కీలకం అని స్పష్టంగా తెలుస్తోంది. శ్రద్దా నటన కూడా సూపర్బ్. మరి మార్చి-06న సినీ ప్రియులు ఏ మాత్రం మార్కులేసి సినిమాను పాస్ చేస్తారో వేచి చూడాల్సిందే.

More News

తల్లిని చంపి.. సోదరుడ్ని పొడిచి.. ప్రియుడికి మాటిచ్చి.. అండమాన్‌కు!!

మానవత్వం మంట గలిసింది. అసలు తామేం చేస్తున్నామో.. అసలెందుకిలా చేస్తున్నామో తెలియక కొందరు పిచ్చిపిచ్చి ప్రవర్తించి కుటుంబ సభ్యులను చంపేందుకు కూడా వెనుకాడట్లేదు.

పాటల విడుదల సన్నాహాల్లో 'కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్'

డాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా, హీరోగా, దర్శకుడిగా పలు సంచలన విజయాలు సాధించడం తెలిసిందే.

పూరి జ‌గ‌న్నాథ్‌, విజ‌య్ దేవర కొండ.. సరికొత్త టైటిల్..!

యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో

'ఆర్ఆర్ఆర్‌' లో ఛాన్స్ ద‌క్కించుకున్న హాట్ బ్యూటీ

ప‌లు సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌, స్పెష‌ల్ రోల్స్‌లో న‌టిస్తోన్న హాట్ బ్యూటీ హంస నందిని ఇప్పుడు భారీ ఛాన్స్‌ను ద‌క్కించుకుంది.

క‌రోనా దెబ్బ‌..వాయిదా వేసుకున్న నాగ్‌!

ప్ర‌పంచం అంతా క‌రోనా ఎఫెక్ట్‌తో భ‌య‌ప‌డుతుంది. ఈ ఎఫెక్ట్ కార‌ణంగా ప్ర‌జ‌లు వేరే ప్ర‌దేశాల‌కు వెళ్లాలంటే భ‌య‌ప‌డుతున్నారు.