క్రికెటర్ అంబటి రాయుడు మంత్రి కేటీఆర్ కు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతిమయం అయిందని కేటీఆర్ కు ట్వీట్ చేశాడు రాయుడు. అలాంటి అప్పుడు హైదరాబాద్ క్రికెట్ టీమ్ ఎలా గొప్పగా ఎదుగుతుంది అని ప్రశ్నించారు. హెచ్ సి ఏ సభ్యులపై ఏసీబీ కేసులు కూడా ఉన్నాయని... దీనిపై కేటీఆర్ దృష్టి పెట్టాలని కోరారు రాయుడు. అయితే దీనిపై ఇప్పటి వరకు కెటిఆర్ స్పందించక పోయినా... హెచ్ సి ఎ అధ్యక్షుడు అయిన మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కౌంటర్ ఇచ్చారు.
అంబటి ఓ ఫ్రస్టేటెడ్ క్రికెటర్ అంటూ విమర్శించారు. మరి అజార్ విమర్శకు .. అంబటి ఎలాంటి ప్రతివిమర్శ చేస్తాడో చూడాలి.అయితే గతంలోనూ అంబటి ఇలాంటి ఓ ట్వీట్ చేశాడు. వాల్డ్ కప్ టైమ్ లో తనను పక్కన పెట్టి విజయ్ శంకర్ ను జట్టులోకి తీసుకోవడం పై ఘాటుగా విమర్శలు చేశాడు. అయితే సెలెక్టర్ అతనికి త్రీ డైమెన్షన్ స్కిల్స్ ఉన్నాయని.. అందుకే సెలెక్ట్ చేశామని చెప్పారు. దీనికి కౌంటర్ గా ... తాను త్రీడీ గ్లాసెస్ ఆర్డర్ చేశానని కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు రాయుడు.