స్పీకర్ రమాదేవిపై ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు!!
Send us your feedback to audioarticles@vaarta.com
లోక్సభ ప్యానల్ స్పీకర్గా ఉన్న రమాదేవిపై సమాజ్వాదీ ఎంపీ ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆజంఖాన్.. స్పీకర్ స్థానంలో ఉన్న రమాదేవిని ఉద్దేశించి మాట్లాడారు. ‘మీ కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడాలని ఉంది’ అని వ్యాఖ్యానించారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఆజం ఖాన్ వ్యాఖ్యాపై బీజేపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రమాదేవికి వెంటనే ఆజంఖాన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సైతం ఆజం ఖాన్ తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరాలని సూచించారు.
ఆజాంఖాన్ వివరణ ఇదీ...
" నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. నేను తప్పుగా మాట్లాడినట్టు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను. అటూ ఇటూ చూసి కాకుండా నా వైపు చూస్తూ మాట్లాడాలని ప్యానెల్ స్పీకర్ రమాదేవి ఆదేశించారు. అందుకే ఈ వ్యాఖ్యలపై నేను స్పందిస్తూ.. మీ కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడాలని ఉందని అన్నాను. ఒకవేళ అలా చేస్తే మీరే నన్ను తప్పుకోమని చెబుతారు. మీరు నాకు సోదరితో సమానం" అని ఆజాం వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఆజం ఖాన్ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సైతం తమ పార్టీ సభ్యుడిని వెనకేసుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout