'అయ్యో రామ' పాటలు విడుదల

  • IndiaGlitz, [Thursday,November 05 2015]

పవన్ సిద్ధు, కామ్నా సింగ్, నిషిత హీరో హీరోయిన్లుగా యానీ క్రియేషన్స్ బ్యానర్ పై కిరణ్ కుమార్ దర్శకత్వంలో గంటా రామక్రిష్ణా నిర్మించిన చిత్రం అయ్యో రామ. సంతోష్ కవల సంగీతం అందించిన ఈ సినిమా పాటలను బుధవారం జరిగిన ఆడియో కార్యక్రమంలో బిగ్ సీడీని బి.జె.పి ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ఆవిష్కించారు. ఆడియో సీడీలను దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ఆవిష్కరించి తొలిసీడీని తుమ్మలపల్లి రామసత్యనారాయణకు అందించారు. బ్యానర్ లోగోను మహర్షి చాముండేశ్వరి నాథ్ ఆవిష్కరించారు.

చింతల రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ 'సినిమా ట్రైలర్స్, పాటలు బావున్నాయి. సినిమాను ఈ స్టేజ్ కు తీసుకురావడమంటే చిన్న విషయం కాదు. నిర్మాత ఎన్నో కష్టనష్టాలకోర్చి సినిమాను నిర్మిస్తాడు. ఈ సినిమా దర్శకుడికి మంచి పేరు, నిర్మాతకు లాభాలు రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

నిర్మాత గంటా రామక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ 'పాటలు బాగా వచ్చాయి. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. దర్శకుడు సంతోష్ కవల మంచి సంగీతాన్ని అందించారు. దర్శకుడు సినిమాను చక్కగా తెరకెక్కించారు'' అన్నారు.

దర్శకుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ 'ఈ సినిమా కోసం రాజేష్ మంచి కథను సిద్ధం చేశారు. పృథ్వీ, చందు టీం అంతా బాగా సపోర్ట్ చేశారు. సంతోష్ సంగీతం, సుమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పవన్, విజయ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతాయి. నా పై నమ్మకంతో ఈ సినిమాను ఎక్కడా వెనుకాడకుండా నిర్మించిన నిర్మాత గారికి థాంక్స్. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ 'యంగ్ టీమ్ అంతా కలసి చేసిన మంచి ప్రయత్నం. సినిమా ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే చాలా ఫ్రెష్ అనే ఫీల్ కలుగుతుంది. ఈ ఏడాది చిన్న సినిమాలు మంచి విజయాలను సాధించాయి. అదేవిధంగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 'సినిమా యూనిట్ ను అభినందిస్తున్నాను. ఈ సినిమా విజయం అందరికీ ఇన్సిపిరేషన్ కావాలి'' అన్నారు.

మహర్షి చాముండేశ్వరి నాథ్ మాట్లాడుతూ 'ట్రైలర్స్, సాంగ్స్ బావున్నాయి. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి టీంకు మంచి పేరు రావడమే కాకుండా భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

హీరో పవన్ సిద్ధు మాట్లాడుతూ 'దర్శక నిర్మాతలు అందించిన సపోర్ట్ మరచిపోలేను. మా యూనిట్ పై నమ్మకంతో ఈ సినిమాను నిర్మించిన నిర్మాతకు థాంక్స్. తప్పకుండా మా ప్రయత్నాని ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది'' అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ కవల మాట్లాడుతూ 'సినిమాలో మంచి మ్యూజిక్ కుదిరింది. నా పై నమ్మకంతో అవకాశాన్నిచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అన్నారు.

ఈ కార్యక్రమంలో బి.జె.సి. రాష్ట్ర సెక్రటరీ రంగారెడ్డి, కపిల్ రాజు తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ ను అభినందించారు.

చంద్రమోహన్, మెల్కోటి, పూర్ణిమ, చంటి, చమ్మక్ చంద్ర, రచ్చరవి, రాఘవ, రామ్ ప్రసాద్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి కథ, మాటలు: రాజేష్ కుమార్ మూడునూరి, కెమెరా: పవన్-విజయ్, ఆర్.ఆర్: సుమన్ జూపూడి, ఎడిటింగ్: అనిల్ రాజ్, నిర్మాత: గంగా రామక్రిష్ణా దర్శకత్వం: కిరణ్ కుమార్.

More News

CLICK HERE: To see Selfie le le re moment for Salman and Sonam

The 49-year-old star Salman Khan and beautiful Sonam Kapoor had welcome with loud cheers and whistles at the Amity University in Nodia. Salman Khan could not wait any further and captured the fan frenzy moment on his phone by taking a selfie with his lady love in the 'Prem Ratan Dhan Payo'.

Really!! Ranbir doesn't want to miss promoting 'Tamasha'?

Dashing star Ranbir Kapoor can’t wait to come back to Mumbai from London to promote Imtiaz Ali's 'Tamasha'. He seems all eager and pepped up to promote the movie that features Deepika Padukone and him in the lead.

Priyanka Chopra lends voice to PETA for a cause

International star Priyanka Chopra has given voice to PETA for a great cause. She has given a voiceover for a robotic elephant named Ellie that is to go on a school tour across US, Europe and India.

Check Out: SRK's son Aryan Khan the new bike lover

King Khan - Shah Rukh Khan is known for his style and love for automobiles, so is his elder son Aryan Khan. He is not only famous on social site but also among girls. Aryan is one stylish kid who is known for his casual and smart looks be it at any party or occasion.

Salman Khan to make his Hollywood debut in 'Expendables 4'

After the beauty queen Priyanka Chopra made her way with 'Quantico' other celebrities in the industry are eager to take that big step. Actors like Aamir Khan and Sonu Sood will soon be seen with Jackie Chan in the movie 'Kung Fu Yoga'. Not far behind, we have ‘Bajrangi Bhaijaan’ star Salman Khan to be seen in 'The Expendables 4'.