Ayyanna Patrudu: లోకేష్‌కు సొంత పార్టీలోనే తీవ్ర అవమానం.. అయ్యన్న ఘాటు వ్యాఖ్యలు..!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగుదేశం పార్టీలో విభేదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పార్టీలో యువనేత నారా లోకేష్ పెత్తనంపై సీనియర్లు తీవ్రంగా మండిపడుతున్నారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు సీనియర్లను పక్కనబెట్టి లోకేష్ అంతా తానై వ్యవరించారని లోలోపల రగిలిపోతున్నారు. అలాగే యువగళం పాదయాత్రలో కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియ్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు లోకేష్ పాదయాత్రపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
త్వరలోనే విశాఖ జిల్లాలోకి..
చంద్రబాబు అరెస్టుతో ఆగిపోయిన లోకేష్ పాదయాత్ర.. ఆయన బెయిల్ మీద విడుదల కావడంతో తిరిగి పున:ప్రారంభించారు. నవంబర్ 27న తిరిగి ప్రారంభమైన పాదయాత్ర కొన్ని రోజలు పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. అయితే మిజాంగ్ తుఫాన్ కారణంగా పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు. ఇప్పుడు తుఫాన్ ప్రభావం తగ్గడంతో డిసెంబర్ 9న మళ్లీ పాదయాత్రను ప్రారభించనున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే విశాఖ జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించనుంది.
డబ్బు ఖర్చు తప్పితే లాభం లేదు..
అయితే తన నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర చేయవొద్దని అయ్యన్నపాత్రుడు చెప్పారని తెలుస్తోంది. పాదయాత్ర తన నియోజకవర్గంలో చేస్తే తనకు నష్టం కలిగే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారట. అంతేకాకుండా డబ్బు ఖర్చు కావడం తప్ప మరే ఇతర లాభం లేదని అయ్యన్న సన్నిహితుల వద్ద చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో సొంత పార్టీ సీనియర్ నేతలే లోకేశ్‌ను నమ్మే పరిస్థితిలో లేకపోవడంతో తాము ఎలా నమ్మాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీని జనాలు నమ్మే పరిస్థితిలో లేరని.. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పట్ల మెజార్టీ ప్రజలు సంతోషంగా ఉన్నారని.. మరోసారి జగన్ సీఎం కావడం ఖాయమని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments