ఈ నెల 21న 'ఆయుష్మాన్ భవ' టీజర్ విడుదల

  • IndiaGlitz, [Saturday,June 16 2018]

చ‌ర‌ణ్ తేజ్ హీరోగా త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నేను లోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న చిత్రం ఆయ‌ష్మాన్‌భ‌వ‌. ఈ చిత్రాన్ని సి టి.ఎఫ్ నిర్మాణ‌ భాద్య‌త‌లు నిర్వ‌హించారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ‌నం తో రూపోందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ లో బేబి డాళ్‌, హంగ్ ఓవ‌ర్‌, హైహీల్స్ లాంటి సూప‌ర్బ్ సాంగ్స్ కంపోజ్ చేసిన మీట్ బ్రోస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం లో ప్ర‌ముఖ హీరో్యిన్ స్నేహ ఉల్లాల్ చ‌ర‌ణ్ తేజ్ స‌ర‌స‌న న‌టిస్తుంది. స‌మాజం ప్రేమ‌ని చూసే ప‌ద్ద‌లి మారాలి అనే క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ లో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ నెల 21న ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు 75వ జన్మదినం సందర్భంగా ఆయుష్మాన్ భవ టీజర్ విడుదల చేయనున్నారు.

ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ తేజ్ మాట్లాడుతూ.. ముందుగా ఈ చిత్రానికి ఇంత మంచి క‌థ ని అందించట‌మే కాకుండా ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్న సూప‌ర్‌ సక్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన గారికి, స్క్రీన్‌ప్లే అందించిన ప్ర‌ముఖ ర‌చ‌యిత‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కి నా హ్రుద‌య‌పూర్వ‌క దన్య‌వాదాలు. అలాగే క్రేజి ద‌ర్శ‌కుడు మారుతి గారి మా చిత్రానికి స‌హ‌నిర్మాత‌గా భాద్య‌త‌లు స్వీక‌రించినందుకు వారికి నా ద‌న్య‌వాదాలు. మేము అడిగిన వెంట‌నే మా క‌థ న‌చ్చి మా చిత్రం లో హీరోయిన్ గా చేస్తున్న స్నేహ ఉల్లాల్ థ్యాంక్స్‌, స్నేహ ఉల్లాల్ పాత్ర చాలా బాగా డిజైన్ చేశాము. బాలీవుడ్ సూప‌ర్ మ్యూజిక్ ద‌ర్శ‌కుడు మీట్ బ్రోస్ మ్యూజిక్ అందిస్తున్నారు.

మ‌న తెలుగు స్టేట్స్ లో మీట్ బ్రోస్ అందించిన ఆడియోను యూత్ విప‌రీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్ప‌డు డైర‌క్ట్ గా వాళ్ళు మా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి కులం, మ‌తం వేరైతే.. మ‌ర్చిపోవాలా.. పారిపోవాలా.. చ‌చ్చిపోవాలా.. ప్ర‌పంచం ఏమైతే నాకేంటి స‌మాజం ప్రేమ‌ని చూసే విధానం మారాలి లేక‌పోతే చంపేస్తా .. అనుకునే హీరో క్యార‌క్ట‌రైజేష‌న్ తో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ నెల 21న ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు గారి 75వ జన్మదినం సందర్భంగా ఆయుష్మాన్ భవ టీజర్ విడుదల చేస్తున్నాం. షూటింగ్ పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంద‌ని న‌మ్ముతున్నాము.. అని అన్నారు..

న‌టీన‌టులు.. చ‌ర‌ణ్‌తేజ్‌, స్నేహ ఉల్లాల్‌, హుజ‌న్‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ రావు, రంగ‌రాజ‌న్‌, అశ్విన్‌, నిఖిత త‌దిత‌రులు

More News

ఒక రోజు గ్యాప్‌లో రెండు చిత్రాలు

మెలోడీ సాంగ్స్‌తో తెలుగుసినీ సంగీత ప్రియుల‌ను అల‌రించిన మ‌ల‌యాళ సంగీత ద‌ర్శ‌కుడు గోపీసుంద‌ర్‌. 'మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు' టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన గోపీ సుంద‌ర్‌..

ర‌జ‌నీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారా?

ఆరు ప‌దులు దాటినా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌లో ఎనర్జీ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. యువ క‌థానాయ‌కుల‌తో పోటీప‌డుతూ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారాయ‌న‌.

కిడ్నప్ డ్రామా నేపథ్యంలో శీను వేణు ప్రారంభం

అభిషేక్ కన్నెలూరు, మధుప్రియ, ప్రజ్వల్ , మమతా శ్రీ హీరో హీరోయిన్లుగా రవి ములకలపల్లి స్వీయ దర్శకత్వంలో వసుందర క్రియేషన్స్ పతాకంపై తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం 'శీను వేణు'.

డైరెక్టర్ గా మారబోతున్న రైటర్ డైమాండ్ రత్నబాబు.

దాసరి నారాయణరావు రైటర్ నుండి డైరెక్టర్ అయ్యారు. జంధ్యాల, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి మొదలగువారు రచయితల నుండి దర్శకులుగా మారి సక్సెస్ అయ్యారు.

విడుదలకు సిద్ధమైన అడవిశేష్ 'గూడాచారి'

అడవి శేష్, శోభిత ధూలిపాళ్ళ హీరో హీరోయిన్స్ గా నటించిన "గూడాచారి" సినిమా ట్రైలర్, పాటలు త్వరలో రిలీజ్ చేసి ఆగష్టు 3న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు నిర్మాతలు.