చివరి షెడ్యూల్ లో 'ఆయుష్మాన్ భవ' నవంబర్ 9న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
నేను లోకల్ చిత్ర దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన స్టోరి, దర్శకత్వ పర్యవేక్షణలో, ప్రముఖ దర్శకుడు మారుతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ఆయష్మాన్‌భవ. ఈ చిత్రంలో చరణ్ తేజ్ హీరోగా స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు.... ఈ చిత్రానికి సి టి.ఎఫ్ నిర్మాతగా నిర్మిస్తున్నారు.
ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ కథనం తో రూపోందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ లో బేబి డాళ్, హ్యాంగ్ ఓవర్, హై హీల్స్ లాంటి సూపర్బ్ సాంగ్స్ కంపోజ్ చేసిన మీట్ బ్రోస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం లో ప్రముఖ హీరో్యిన్ స్నేహ ఉల్లాల్ ప్రత్యేఖ పాత్రలో నటిస్తుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సమాజం ప్రేమని చూసే పద్దలి మారాలి అనే కమర్షియల్ పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. 80% షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని నవంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా కథానాయకుడు చరణ్ తేజ్ మాట్లాడుతూ.. కథ, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న సూపర్ సక్సెస్ ఫుల్ దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన గారు. పరుచూరి బ్రదర్స్ మంచి స్క్రీన్‌ప్లే అందించారు. క్రేజి దర్శకుడు మారుతి గారు కొ-ప్రోడ్యూసర్. స్నేహ ఉల్లాల్ మంచి పాత్రలో మళ్ళీ టాలీవుడ్ కి రీ-ఎంట్రి ఇస్తుంది. టాలీవుడ్ లో మరో టాప్ హీరోయిన్ మరో కీలక పాత్రలో నటించబోతున్నారు. బాలీవుడ్ సూపర్ మ్యూజిక్ దర్శకుడు మీట్ బ్రోస్ మ్యూజిక్ అందించారు. త్వరలో ఈ చిత్రం సింగిల్స్ ని విడుదల చేస్తాము. ఇటీవల విడుదల చేసిన ఆయుష్మాన్ భవ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అటు ప్రేక్షకులతో పాటు ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి.
ప్రేమించిన అమ్మాయి కులం, మతం వేరైతే.. మర్చిపోవాలా.. పారిపోవాలా.. చచ్చిపోవాలా.. ప్రపంచం ఏమైతే నాకేంటి సమాజం ప్రేమని చూసే విధానం మారాలి లేకపోతే చంపేస్తా .. అనుకునే హీరో క్యారక్టరైజేషన్ తో ఈ చిత్రం తెరకెక్కింది. 5 నెలల ముందుగానే మా చిత్రం డేట్ నవంబర్ 9 గా డిసైడ్ అయ్యాము. బాలీవుడ్ లో లాగా చాలా ప్లానింగ్ తో ఈ చిత్రాన్ని చేశాము. అందుకే ఇంత ఎర్లిగా మా చిత్రం విడుదల తేదిని ఖరారు చేశాము. ఈ 5 నెలల్లో ఎన్నో సర్‌ప్రైజ్ లు అందిస్తాము. ప్రమోషన్ ని చాలా వైవిధ్యంగా ప్లాన్ చేస్తున్నాము. ఆయుష్మాన్ భవ తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని నమ్ముతున్నాము.. అని అన్నారు..
నటీనటులు.. చరణ్‌తేజ్, స్నేహ ఉల్లాల్, హుజన్, పరుచూరి వెంకటేశ్వ రావు, రంగరాజన్, అశ్విన్, నిఖిత తదితరులు ..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com