అయోధ్య నేపథ్యంలో మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశంలో అతిపెద్ద, దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే కీలక అయోధ్య భూవివాదం కేసులో అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం విదితమే. వివాదాస్పద స్థలం హిందువులకు.. ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం అంటూ దశాబ్దాలుగా నెలకొన్న ఈ వివాదానికి ఒకే ఒక్క గంటలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చేసింది. అయితే ఈ తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా అయోధ్య, యూపీలోని కీలక ప్రాంతాల్లో భారీగా పారామిలటరీ దళాలను మోహరించారు. ఆయోధ్య పరిసర ప్రాంతాల్లో దాదాపు 20 వేల మందిని భద్రతకు నియమించినట్లు ఇదివరకే కేంద్ర హోం శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అంతేకాదు.. ఉత్తరప్రదేశ్ సహా ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సోమవారం వరకు సెలవులు ప్రకటించగా, రాజస్థాన్, కర్ణాటక, జమ్మూకశ్మీర్ ప్రభుత్వాలు కూడా పాఠశాలలకు శనివారం సెలవులు ప్రకటించాయి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది.
కోడ్ అమలు చేయాల్సిందే..
అయితే తీర్పు అనంతరం.. దేశంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనల జరగకుండా ఉండేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. టీవీ చానళ్లలో చేపట్టే చర్చా కార్యక్రమాలు, డిబేట్లు, రిపోర్టింగ్ సందర్భంగా ప్రోగ్రామ్ కోడ్‌ను కచ్చితంగా అమలు చేయాలని అలా కాని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఆదేశించింది. అంతేకాదు.. చానళ్లతో పాటు కేబుల్ టీవీ ఆపరేటర్లకు సైతం ప్రోగ్రామ్ కోడ్‌ను పాటించాలని ఓ ప్రకటనలో తెలిపింది. ఇది అన్ని చానళ్లకు, దేశంలోని అందరు కేబుల్ ఆపరేటర్లకు వర్తిస్తుందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది.
నియమ నిబంధనలు ఈ కింది ప్రకటనలో చూడగలరు..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments