Ayodhya Rama Mandira:అయోధ్య రామమందిర ప్రతిష్ట.. 100 రోజులు.. 1000 రైళ్లు..
Send us your feedback to audioarticles@vaarta.com
వందల సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న హిందువుల కల నెరవేరే సమయం ఆసన్నమవుతోంది. అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తి కావస్తోంది. జనవరి 22న ఆలయ ప్రతిష్టకు ముహుర్తం కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో మహాక్రతువును ఘనంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఇక శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత రోజు నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు. దీంతో ఆ అద్భుత క్షణాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఆలయ దర్శనానికి దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో అయోధ్యకు మొదటి 100 రోజుల్లో 1000 రైళ్లను నడపాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఈ రైళ్లు జనవరి 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణే, కోల్‌కతా, నాగ్‌పూర్, లక్నో, జమ్మూ సహా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకు రైళ్లను నడపనున్నట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. డిమాండ్‌ను బట్టి ప్రత్యేక రైళ్లు తీసుకొస్తామంటున్నారు. ఇందుకోసం అయోధ్యలోని రైల్వేస్టేషన్ కూడా అధిక సంఖ్యలో ప్రయాణికులకు అనుగుణంగా పునరుద్ధరించారని పేర్కొంటున్నారు. రోజుకు దాదాపు 50వేల మంది రాకపోకలు సాగించే సామర్థ్యంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని.. జనవరి 15 నాటికి స్టేషన్ పూర్తిగా సిద్ధమవుతుందని తెలిపారు.
ఇక జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామ్ లల్లా ప్రతిష్టాపన ప్రక్రియను ప్రారంభించి 10 రోజుల పాటు ప్రతిష్ట కార్యక్రమాన్ని ట్రస్ట్ నిర్వాహకులు నిర్వహించనున్నారు. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా 2500 మంది ప్రముఖులు, 4వేల మంది సాధువులు పాల్గొననున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout