Ayodhya Rama Mandira:అయోధ్య రామమందిర ప్రతిష్ట.. 100 రోజులు.. 1000 రైళ్లు..

  • IndiaGlitz, [Saturday,December 16 2023]

వందల సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న హిందువుల కల నెరవేరే సమయం ఆసన్నమవుతోంది. అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తి కావస్తోంది. జనవరి 22న ఆలయ ప్రతిష్టకు ముహుర్తం కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో మహాక్రతువును ఘనంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఇక శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత రోజు నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు. దీంతో ఆ అద్భుత క్షణాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో ఆలయ దర్శనానికి దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో అయోధ్యకు మొదటి 100 రోజుల్లో 1000 రైళ్లను నడపాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఈ రైళ్లు జనవరి 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణే, కోల్‌కతా, నాగ్‌పూర్, లక్నో, జమ్మూ సహా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకు రైళ్లను నడపనున్నట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. డిమాండ్‌ను బట్టి ప్రత్యేక రైళ్లు తీసుకొస్తామంటున్నారు. ఇందుకోసం అయోధ్యలోని రైల్వేస్టేషన్ కూడా అధిక సంఖ్యలో ప్రయాణికులకు అనుగుణంగా పునరుద్ధరించారని పేర్కొంటున్నారు. రోజుకు దాదాపు 50వేల మంది రాకపోకలు సాగించే సామర్థ్యంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని.. జనవరి 15 నాటికి స్టేషన్ పూర్తిగా సిద్ధమవుతుందని తెలిపారు.

ఇక జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామ్‌ లల్లా ప్రతిష్టాపన ప్రక్రియను ప్రారంభించి 10 రోజుల పాటు ప్రతిష్ట కార్యక్రమాన్ని ట్రస్ట్ నిర్వాహకులు నిర్వహించనున్నారు. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా 2500 మంది ప్రముఖులు, 4వేల మంది సాధువులు పాల్గొననున్నారు.

More News

Purandeshwari:జనసేనతో పొత్తుపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

మరో మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.

Akbaruddin:వైయస్సార్ హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగింది: అక్బరుద్దీన్

ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలిపించలేకపోయాయని ఎంఐఎం ఎమ్మెల్యే

Revanth Reddy-KTR:అసెంబ్లీలో ఢీ అంటే ఢీ.. సీఎం రేవంత్, కేటీఆర్ మధ్య మాటల తూటాలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. గవర్నర్‌కు ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్,

Pawan Kalyan:యువగళం ముగింపు సభకు రాలేను: పవన్ కల్యాణ్

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో

Salaar:'సలార్' మూవీ తొలి టికెట్ కొనింది ఎవరంటే..?

దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా 'సలార్' ఫీవరే కనిపిస్తోంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడం,