అయోధ్య రామాలయానికి భూమి పూజ చేసిన మోదీ..
- IndiaGlitz, [Wednesday,August 05 2020]
యావత్ భారతావనికి ఉత్కంఠ భరితమైన క్షణాలివి.. శ్రీరామ నామ జపంతో దేశ మొత్తం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఏళ్ల నాటి కలకు అంకురార్పణ జరిగింది. అంతటి అద్బుత దృశ్యాన్ని ప్రజలంతా వీక్షించి ఆనందపరవశులయ్యారు. ముందుగా అనుకున్న ముహూర్తానికే కార్యక్రమం జరిగింది. అయోధ్య రామాలయ శంకుస్థాపన ప్రధాని మోదీ చేతుల మీదుగా మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు జరిగిపోయింది. భూమి పూజకు ముందు మోదీ హనుమాన్‌గర్హి మందిరంలో పూజలు నిర్వహించారు. ప్రధాని వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీ బెన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా కార్యక్రమం జరిగిపోయింది.