ధ‌నుష్ చిత్రానికి హాలీవుడ్ అవార్డ్‌

  • IndiaGlitz, [Tuesday,May 07 2019]

టాలీవుడ్‌, బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన కోలీవుడ్ హీరో ధ‌నుష్‌. ఈయ‌న హీరోగా న‌టించి తొలి హాలీవుడ్ చిత్రం 'ది ఎక్ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ఫ‌కీర్‌'. ఇంగ్లీష్‌, స్పెయిన్ భాషల్లో ఈ సినిమా తెర‌కెక్కింది. ఇందులో స్ట్రీట్ మేజిక్ మ్యాన్ పాత్రలో ధనుష్ నటించాడు.తనకు ప్రత్యేక శక్తులు ఉన్నాయ‌ని అంద‌రినీ న‌మ్మించి మోసం చేస్తుంటాడు. ఈ చిత్రాన్ని ఇండియాతో పాటు ఇంట‌లీ, లిబియా ప్రాంతాల్లో చిత్రీక‌రించారు.

రీసెంట్‌గా విడుద‌లైన ఈ చిత్రం విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో స్పెయిన్ దేశంలోని బార్సిలోనా సెయింట్ జార్జి అంత‌ర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఈ చిత్రాన్ని ప్ర‌దర్శించారు. ఉత్త‌మ హాస్య చ‌ల‌న చిత్రం కేట‌గిరీలో ధ‌నుష్‌కి బెస్ట్ క‌మెడియ‌న్ అవార్డ్ వ‌చ్చింది. దీనిపై ధ‌నుష్ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.