'బాహుబలి' కొడాలిని ఢీ కొట్టనున్న అవినాష్..

  • IndiaGlitz, [Saturday,March 09 2019]

హ్యాట్రిక్ ఎమ్మెల్యే.. వైసీపీలో ‘బాహుబలి’గా పేరుగాంచిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఢీ కొనేందుకు టీడీపీ అధిష్టానం అభ్యర్థిని ఫిక్స్ చేసింది. ఇన్ని రోజులు అసలు ఇక్కడ్నుంచి ఎవర్ని దింపాలి..? ఎవర్ని బరిలోకి దింపితే గెలిచే అవకాశాలుంటాయ్..? ఇప్పటి వరకూ పోటీచేసిన వ్యక్తినే మళ్లీ బరిలోకి దింపాలా..? లేకుంటే కొత్త వ్యక్తిని రంగంలోకి దింపితే ఎలా ఉంటుంది..? అని కొన్ని సర్వేలు చేయించిన సీఎం చంద్రబాబు ఎట్టకేలకు యువనేత దేవినేని అవినాష్‌ పేరును ఖరారు చేశారు. శుక్రవారం రాత్రి సుధీర్ఘంగా చర్చించిన అనంతరం ఫైనల్‌‌గా ఈ ప్రకటన విడుదల చేయడం జరిగింది.

ఇన్ని రోజులుగా గుడివాడలో నెలకొన్న ఉత్కంఠకు చంద్రబాబు తెరదించారని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు గుడివాడ టీడీపీకి కంచుకోట. దివంగత ముఖ్యమంత్రి తారకరామారావు కూడా రెండు పర్యాయాలు ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2004 నుంచి గుడివాడ అంటే కొడాలి.. కొడాలి అంటే గుడివాడ అన్నట్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రెండుసార్లు అనగా 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన కొడాలి నాని.. ఫస్ట్ టైం 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున 11,537 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కూడా గుడివాడలో వైసీపీ జెండా ఎగరేసి తీరుతానని ధీమాతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ప్రచారం కూడా షురూ చేసేశారు కొడాలి. 

దేవినేని ఫ్యామిలీ అంటే కృష్ణా జిల్లాలో మంచి పేరుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఒకప్పుడు దేవినేని, రంగా ఫ్యామిలీస్‌‌ కృష్ణా జిల్లాను ఏలాయని చెప్పుకోవచ్చు. నాటి నుంచి నేటి వరకూ ఈ రెండు కుటుంబాలు ప్రత్యర్థులే. అయితే ఈ పేరు చాలు గుడివాడలో టీడీపీ జెండా ఎగరేయడానికి అని భావించిన టీడీపీ అధిష్టానం ప్రత్యేకంగా సర్వేలు చేయించి అనంతరం దేవినేని అవినాష్ పేరును ఖరారు చేయడం జరిగింది. కాగా.. కాలేజీ టైమ్‌‌లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు యువత తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి తనదైన శైలిలో జనాల్లోకి దూసుకెళ్లారు.

దేవినేని ఫ్యామిలీ పేరే కాదు.. సామాజిక వర్గం పరంగా కూడా కలిసిసొస్తుందని టీడీపీ భావిస్తోంది.. కచ్చితంగా కొడాలిపై కనీసం 5వేలు మొదలుకుని 10వేల మెజార్టీ వరకు అవినాష్‌కు వస్తుందని ముందే పార్టీ నేతలు ఊహించేసుకున్నారట. అయితే  వైసీపీ అభ్యర్థి అయిన కొడాలి మాత్రం సీఎం చంద్రబాబు అయినా సరే దమ్ముంటే తనపై పోటీ చేసి గెలుచుకోవాలని ఇప్పటికే పలుమార్లు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. నాటి నుంచి నానిని టార్గెట్ చేసిన టీడీపీ... ఈ ఎన్నికల్లో కచ్చితంగా ఓడించాలని భావిస్తోంది. అయితే అవినాష్ ఏ మాత్రం కొడాలిని ప్రభావితం చేస్తారు..? కొడాలి అడ్డాపై టీడీపీ జెండా అదృష్టం అవినాష్‌‌‌కు ఏ మాత్రం దక్కుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

టీడీపీలోకి కౌశల్.. ఎంపీగా పోటీ..!

టాలీవుడ్ నటుడు, బిగ్‌బాస్ విజేత కౌశల్ సైకిలెక్కేశారా..? ఇక అధికారికంగా పసుపు కండువా కప్పుకోవడమే ఆలస్యమా..? 2019 ఎన్నికల్లో ఆయన ఎంపీగా బరిలోకి దిగనున్నారా..?

నరేశ్ ప్యానెల్‌కు మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్

‘మా’ అసోసియేషన్ ఎన్నికలపై మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన మద్దతు నరేశ్, రాజశేఖర్ ప్యానల్‌కు ఉంటుందని ప్రకటించారు.

సీత ఆన్ ది రోడ్ ట్రైలర్ విడుదల

కల్పిక గణేష్, గాయత్రి గుప్త, కాతెర హకిమి, నేసా ఫర్ హాది, ఉమా లింగయ్య ప్రధాన పాత్రల్లో

'డేటా చోరి' : సంచలన నిజాలు బయటపెట్టిన నటుడు శివాజీ

‘డేటా చోరీ’ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై అప్పుడెప్పుడో ‘ఆపరేషన్ గరుడ’..

కేసీఆర్‌పై నటుడు శివాజీ షాకింగ్ కామెంట్స్

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నటుడు శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.