తొలిసారి నామినేషన్స్‌లో అవినాష్..
Send us your feedback to audioarticles@vaarta.com
మంచి జోష్ ఉన్న సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. నేటి షోలో నామినేషన్స్ జరిగాయి. ఇంతకు ముందు వారాలతో పోలిస్తే.. ఈ వారం నామినేషన్స్ ప్రశాంతంగానే జరిగాయని చెప్పాలి. హారిక టీషర్టుపై అవినాష్ కామెంట్స్‌కి సొహైల్, అఖిల్ బాగా ఎంజాయ్ చేశారు. బిగ్‌బాస్.. అవినాష్ నన్ను లూజ్ అన్నాడే అని హారిక కామెడీ చేసింది. తరువాత అభి, మోనాల్ మాట్లాడుకోకపోవడంపై వాళ్లిద్దరితో మాట్లాడాలని అనుకుంటున్నానని నోయెల్‌కు అరియానా చెప్పింది. తప్పేం లేదు మాట్లాడమని చెప్పాడు. తరువాత అభి దగ్గరకు వెళ్లి నీతో మాట్లాడాలనుకుంటున్నా అని అడిగింది. ఆ విషయం గురించి మాట్లాడకపోవడమే బెటర్ అన్నట్టు అభి చెప్పాడు. ఆ తరువాత నోయెల్.. తనకు, అరియానాకు జరిగిన కాన్వర్సేషన్ను అభి, హారిక, లాస్యలకు చెప్పాడు. అరియానాకు ఎందుకని అభి ఫీలయ్యాడు.
నామినేషన్స్ ప్రారంభమైంది. నోయెల్ ఆల్రెడీ మొన్న టాస్క్‌లో నామినేట్ అయ్యాడు. అలాగే అమ్మ రాజశేఖర్ నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు కాబట్టి వారిద్దరినీ పక్కన బెట్టారు. తమను తాము నామినేట్ కాకుండా ఉండేందుకు చర్చించుకుని ఎవరు నామినేట్ అవుతారో బిగ్‌బాస్‌కు చెప్పాలి. దీని కోసం ఇద్దరిద్దరిని కలిపి జంటలను చేశారు. ఈ జంటలే చాలా ఆసక్తికరం. మొదట అఖిల్, మోనాల్‌ల మధ్య చర్చ. మోనాల్ నామినేట్ అయ్యేందుకు అంగీకరించింది. తరువాత అవినాష్, సొహైల్‌ల మధ్య చర్చ. ఇద్దరి మధ్య చర్చ జరిగినప్పటికీ నామినేట్ అయ్యేందుకు ఇద్దరూ అంగీకరించలేదు. మరోవైపు అవినాష్‌కి అమ్మ రాజశేఖర్ సైగ చేసి ఏదో చెప్పేందుకు ట్రై చేస్తున్నారు. అలాగే సొహైల్‌కి మెహబూబ్.. ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. అయినా ఎంతకీ ఇద్దరూ నామినేషన్స్‌కి ఒప్పుకోలేదు. ఇది వ్యక్తిగత వ్యవహారమని తనను ఇన్వాల్వ్ చెయ్యొద్దని బిగ్‌బాస్ చెప్పకనే చెప్పారు. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది.
ఇక్కడకు ఏం వదులుకుని వచ్చామో మాకు తెలుసు. చిన్న చిన్న విషయాలకు నామినేట్ చేయడం కరెక్ట్ కాదని బిగ్‌బాస్‌కు అవినాష్ చెప్పాడు. తరువాత తాను నామినేట్ అవుతున్నట్టు అవినాష్ చెప్పాడు. తొలిసారి అవినాష్ నామినేషన్స్‌లోకి వచ్చాడు. నామినేట్ అయినందుకు అవినాష్ బాగా హర్ట్ అయినట్టు కనిపించాడు. తరువాత అభి, హారికల మధ్య చర్చ. అభి తను నామినేట్ అయి.. హారికను సేఫ్ చేశాడు. లాస్య, దివిల మధ్య చర్చ జరుగుతుంటే హారిక వచ్చి నోయెల్‌కు అభికి, తనకు మధ్య జరిగిన చర్చను చెప్పింది. లాస్య, దివిలలో దివి నామినేట్ అయింది. లాస్య సేఫ్ అయింది. ఇక మెహబూబ్, అరియానాల మధ్య చర్చ. ఇద్దరూ ఎవరికి వారు ఏమాత్రం తగ్గలేదు. ఇద్దరి మధ్య బీభత్సమైన చర్చ. చివరకు అరియానా నామినేట్ అవుతున్నట్టు ప్రకటించింది. దీంతో మెహబూబ్ సేఫ్ అయ్యాడు. అరియానాను సొహైల్ వచ్చి అభినందించడం మంచిగా అనిపించింది. ఫైనల్‌గా మోనాల్, అవినాష్, అభిజిత్, దివి, అరియానా, నోయెల్ నామినేట్ అయ్యారు. నామినేట్ అయినందుకు అరియానా కూడా చాలా హర్ట్ అయింది. సొహైల్, అఖిల్ వచ్చి అరియానా ఓదార్చడానికి ట్రై చేశారు.
అరియానా నామినేట్ అయిన తరువాత కూడా మెహబూబ్ వచ్చి ఏదో కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. మెహబూబ్ నామినేట్ అయి తన రేంజ్‌ను డౌన్ చేసుకున్నాడని అమ్మ రాజశేఖర్ లాస్య, అవినాష్‌కు చెప్పాడు. మరి నామినేట్ కాకుండా హాఫ్ షేవ్ చేసుకున్నప్పుడు అమ్మకు ఈ విషయం గుర్తుకు రాలేదు. సొహైల్.. నోయెల్‌కు మధ్య అరియానా గురించి చర్చ. తమ ఇంట్లో మగదిక్కు లేదని అరియానా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సొహైల్ గుర్తు చేసుకున్నాడు. మగదిక్కు లేకున్నా తన కుటుంబం కోసం అరియానా స్ట్రాంగ్‌గా నిలబడిందని సొహైల్ చెప్పాడు. ఇప్పుడు తనకు మెహబూబ్, అరియానాలు సమానమని నోయెల్‌కు సొహైల్ చెప్పాడు. ఈ మాటతో సొహైల్ మరింత మంది అభిమానులను సంపాదించుకుంటాడనే చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com