అవినాష్ ఎలిమినేట్.. వెళ్తూ వెళ్తూ..
Send us your feedback to audioarticles@vaarta.com
‘నిను కోరే వర్ణం’ సాంగ్‌తో నాగ్ ఎంట్రీ ఇచ్చారు. సండే ఫన్ డేలో భాగంగా.. ఒక్కొక్కరికీ ఒక బోర్డ్, పెన్ ఇచ్చారు. ఒక్కొక్కరినీ మూడు క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్‌కి కరెక్ట్‌గా ఆన్సర్ చేసిన కంటెస్టెంట్స్‌కి రోజెస్ ఇస్తారు. ముందుగా అఖిల్‌ను.. నీ ఫేవరెట్ మూవీ ఏంటి? నీ ఒంటిపై ఎన్ని టాట్యూస్ ఉన్నాయి? నువ్వు స్నానం చేయడానికి ఎంత టైమ్ తీసుకుంటావు అని అడిగారు. నెక్ట్స్ అరియానాను.. నువ్వు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటని అడిగారు. రెండోది నీ ఊతపదం ఏంటి? అని అడిగారు. ఇప్పటి వరకూ బయట పెట్టకూడదన్న టాలెంట్ ఏంటని మూడవ క్వశ్చన్ అడిగారు. నెక్ట్స్ హారికను.. నీకున్న ఎన్నోయింగ్ హ్యాబిట్ ఏంటని అడిగారు. రెండోది.. నీ ముద్దు పేరేంటని అడిగారు. హారిక కళ్లు ఏ కలర్లో ఉంటాయని అడిగారు. తర్వాత సొహైల్‌ను.. ఎంత మంది అమ్మాయిలకు లవ్ లెటర్ రాశాడని అడిగారు. నువ్వు ఇంటి నుంచి కార్ఖానాకు వెళ్లడానికి ఎంత టైమ్ పడుతుంది? నీకు బాగా ఇష్టమైన ప్రొఫెషన్ ఏంటి? అని అడిగారు. తెలియని పెళ్లికి ఎప్పుడైనా వెళ్లావా? మోనాల్‌ను.. నువ్వు అవినాష్‌ని ఎన్ని సార్లు ముద్దు పెట్టుకున్నావు? నీకు ఇష్టమైన వెజిటబుల్ ఏది? నువ్వు ఎన్ని తెలుగు సినిమాల్లో నటించావు? అవినాష్‌ను.. నీ భార్యలో ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీ ఏంటి? నువ్వు అరియానా కోసం సోఫాపైన ఏం రాశావు? నీ మొదటి జీతం ఎంత? అని అడిగారు. తరువాత అభిని.. నీ డ్యాన్సింగ్కి రేట్ ఎంత ఇచ్చుకుంటావు? నువ్వు ఇంట్లో వండిన టేస్టీయెస్ట్ డిష్ ఏంటి? నీ షూ సైజ్ ఎంత? హారిక, సొహైల్, మోనాల్‌కి ఎక్కువ పువ్వులు వచ్చాయి.
సొహైల్, హారిక, మోనాల్‌కి మళ్లీ క్వశ్చన్ అడిగారు. అభి చేసిన వెబ్ సిరీస్ ఏంటి? అని అడిగితే మోనాల్ తప్ప ‘పెళ్లిగోల’ అని కరెక్ట్‌గా రాశారు. తరువాత అరియానా వాళ్ల మదర్ జాబ్ ఏంటని అడిగారు. నర్స్ అని సొహైల్ ఒక్కడే చెప్పి ఈ రౌండ్ విన్ అయ్యాడు. మళ్లీ టికెట్ ఫినాలే రేస్‌లో ఉన్న ఆవును ఒకరిని సేఫ్ చేయడానికి తీసుకొచ్చారు. నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ దానిని ప్రసన్నం చేసుకోవాలి. మోనాల్, తరువాత అవినాష్, అభి, హారిక ప్రసన్నం చేసుకునేందుకు ట్రై చేశారు. కానీ మొదటి రౌండ్లో ఎవరినీ సేఫ్ చేయలేదు. మరోసారి ట్రై చేయమని నాగ్ చెబితే.. ట్రై చేశారు. ఫైనల్‌గా ఆవు.. అభిని సేఫ్ చేసింది. స్పాటిఫై టాస్క్. స్లీన్ షాట్.. బాల్.. బోర్డ్ పెట్టారు. స్లీన్ షాట్లో బాల్ని పెట్టి.. లాగి బోర్డును కొట్టాలి. ఏ బోర్డుకు తగిలితే ఆ పాటను ఒకరికి అంకింత చేయాలి. హారిక లవ్ సాంగ్‌కి కొట్టింది. ఆ సాంగ్‌ని మోనాల్‌కి డెడికేట్ చేసింది. నెక్ట్స్ అఖిల్‌కి ఎనర్జీ బీట్ సాంగ్ వచ్చింది. దానిని సొహైల్‌కి డెడికేట్ చేశారు. సొహైల్‌కి టాలీవుడ్ హంక్ సాంగ్ వచ్చింది. దానిని అఖిల్‌కి డెడికేట్ చేశాడు. అరియానాకు దోస్త్ మేరా దోస్త్ సాంగ్ వచ్చింది. దానిని అవినాష్‌కి డెడికేట్ చేసింది. నెక్ట్స్ అవినాష్‌కి సామజవరగమనా సాంగ్ వచ్చింది. దీనిని అరియానాకు డెడికేట్ చేశాడు. నెక్ట్స్ అభికి ముక్కాలా సాంగ్ వచ్చింది దాన్ని సొహైల్‌కి డెడికేట్ చేశాడు. మోనాల్‌కి.. అందమైన ప్రేమరాణి సాంగ్ వచ్చింది. అఖిల్, హారికలకు డెడికేట్ చేసింది. అభి, మోనాల్, హారిక మరోసారి ట్రై చేశాడు. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ వచ్చింది. దానిని అవినాష్‌కి డెడికేట్ చేశాడు. మోనాల్‌కి.. కాటుక కనులే సాంగ్ వచ్చింది. దీనిని అఖిల్‌కి డెడికేట్ చేసింది. పులిహోర రాజా అంటే అఖిల్ అని అంతా కలిసి చెప్పారు. హారికకు.. హోయనా సాంగ్ వచ్చింది. దానిని అభికి డెడికేట్ చేసింది.
తరువాత నామినేషన్స్ నుంచి హారికను సేఫ్ చేశారు. ఇక నామినేషన్స్‌లో మోనాల్, అవినాష్ ఉన్నారు. మోనాల్ సేఫ్.. అవినాష్ నామినేట్ అయ్యాడు. అవినాష్ జర్నీని తన ఎంట్రీ ప్రోమోతో స్టార్ట్ చేశారు. అన్ని భావోద్వేగాలనూ అద్భుతంగా చూపించారు. సీజన్ 4 గ్రేటెస్ట్ ఎంటర్టైనర్ అని అవినాష్‌ని నాగ్ చెప్పారు. మోనాల్ కిచెన్‌లో ఎలా బిహేవ్ చేస్తుందో చాలా ఫన్నీగా చేసి చూపించాడు. మోనాల్ తెలుగు ఎంత క్యూట్‌గా మాట్లాడుతుందో కూడా ఇమిటేట్ చేశాడు. సొహైల్‌ని చూస్తే తనను తాను చూసుకున్నట్టు ఉందని చెప్పాడు. కెమెరాలున్నాయని అస్సలు పట్టించుకోడని చెప్పాడు. సొహైల్ గురించి చెబుతూ అవినాష్ కామెడీ ఇరగదీశాడు. అఖిల్.. మామూలు పులిహోర రాజా కాదని.. ఒక్కసారి కెమెరాలు ఆపేస్తే పెద్ద బేసిన్ని తీసుకుని కలుపుతాడని చెప్పాడు. అరియానా.. సీరియస్‌గా కూర్చొంది. ఆమెను నవ్వించేందుకు ట్రై చేశాడు. నామినేట్ చేసేటప్పుడు బాడీ లాంగ్వేజ్ గురించి అవినాష్ చెప్పి నవ్వించాడు. హారిక.. వాకింగ్ స్టైల్ చెప్పి నవ్వించాడు. హారిక చాలా స్ట్రాంగ్ అమ్మాయని.. అబ్బాయిలతో ఈక్వల్‌గా ఫైట్ చేస్తుందని చెప్పాడు. ఇక అభి గురించి.. ఆయన షో నుంచి వెళ్లేటప్పుడు కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చి పంపించాలని వాటిలో కప్పు, కెటిల్ అని చెప్పాడు. అభి వాకిం్ స్టైల్ గురించి చెప్పి అదరగొట్టాడు. తనకు తనే మాట్లాడుకుంటాడు.. తన ప్రాబ్లమ్స్‌ని తనే సాల్వ్ చేసుకుంటాడని చెప్పాడు. ఇక బిగ్‌బాంబ్.. వన్ వీక్ వాళ్లు ఏ పనీ చేయాల్సిన అవసరం లేదు.. దీనిని అవినాష్.. అభికి ఇచ్చాడు. మొత్తానికి అవినాష్ వెళ్తూ వెళ్తూ కామెడీతో అదరగొట్టేశాడు. రియల్ కమెడియన్ అనిపించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments