అవికా స్పీడ్ పెంచుతోంది
Send us your feedback to audioarticles@vaarta.com
బుల్లితెర నుంచి వెండితెర వరకు నట ప్రయాణం చేసిన అవికా గోర్.. తెలుగులో అనతికాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. 'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్తా మావ చిత్రాలతో' హిట్ చిత్రాల కథానాయికగా పేరు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే.. 2013లో 'ఉయ్యాలా జంపాలా', 2014లో 'లక్ష్మీ రావే మా ఇంటికి'.. ఇలా గత రెండేళ్లుగా ఏడాదికో సినిమా చొప్పున సరిపెట్టిన అవికా.. ఈ ఏడాది మాత్రం ఏకంగా మూడు సినిమాలతో సందడి చేస్తోంది.
ఇప్పటికే ఈ సంవత్సరంలో 'సినిమా చూపిస్తా మావ'తో పలకరించిన అవికా.. ఈ నెల 27న 'తను నేను'తో సందడి చేయనుంది. అలాగే ఆమె నటించిన మరో తెలుగు చిత్రం 'మాంజ' కూడా డిసెంబర్లో విడుదలకు సిద్ధమైంది. ఈ తీరు చూస్తుంటే.. అవికా స్పీడ్ పెంచుతున్నట్లే అనిపిస్తోంది. అన్నట్టు.. నిఖిల్ హీరోగా నటించనున్న ఓ కొత్త సినిమాలోనూ అవికా ఓ హీరోయిన్గా నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com