రాజుగారిగ‌ది వైపు అవికా చూపు

  • IndiaGlitz, [Monday,July 08 2019]

త‌మ‌న్నా ఉంటే 'రాజుగారిగ‌ది 3'పై మంచి హైప్ వ‌స్తుంద‌ని అనుకున్నాడు డైరెక్ట‌ర్ ఓంకార్‌. అయితే ముందు చెప్పిన స్క్రిప్ట్‌, ఫైన‌ల్ స్క్రిప్ట్‌కి తేడా ఉండ‌టంతో త‌మ‌న్నా ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుండి. స‌రేన‌ని, మ‌రో స్టార్ హీరోయిన్ కాజ‌ల్‌ను సంప్ర‌దించాడు. అయితే కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్ అడ‌గటంతో మ‌రో హీరోయిన్ కోసం అన్వేష‌ణ‌లో ప‌డ్డాడీ ద‌ర్శ‌కుడు. అలాంటి త‌రుణంలో 'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త‌మావ‌', 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన అవికాగోర్ ఈ సినిమాలో న‌టించ‌డానికి ఓకే చెప్పింది.

ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే న్యూయార్క్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో స్క్ర్రీన్‌ప్లే కోర్సు కోసం సినిమాల‌కు దూర‌మైన అవికాగోర్.. మంచి రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తుంది. ఇలాంటి త‌రుణంలో ఆమెకు 'రాజుగారిగ‌ది 3' రూపంలో రీ ఎంట్రీకి మంచి అవ‌కాశ‌మే ద‌క్కింద‌నాలి. ఈ నెల మూడో వారంలో సెట్స్‌పైకి సినిమా వెళ్ల‌నుంది. మ‌రి అవికాకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.