అవికా గోర్ రొమాంటిక్ మూవీ టైటిల్ ఇదిగో!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ బ్యూటీ అవికా గోర్ నేడు తన 24వ పుట్టినరోజు జరుపుకుంటోంది. దీనితో ఆమెకు సన్నిహితుల నుంచి అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా అవికా గోర్ కొన్ని రోజుల క్రితం తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 'అవికా స్క్రీన్ క్రియేషన్స్' పేరుతో అవికా గోర్ సొంత నిర్మాణ సంస్థని ప్రారంభించింది.
ఈ బ్యానర్ లో తొలి చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో అవికా గోర్, సాయి రాంక్ జంటగా నటిస్తున్నారు. అవికా బర్త్ డే సందర్భంగా నేడు ఈ చిత్ర టైటిల్ రివీల్ చేశారు.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'పాప్ కార్న్' అనే కూల్ టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ మోషన్ పోస్టర్ లో అవికా, సాయి రాంక్ ట్రెండీగా కనిపిస్తున్నారు. అవికా చేతిలో డ్రింక్ పట్టుకుని సాయి రాంక్ వైపు రొమాంటిక్ గా చూస్తోంది.
మురళి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఉయ్యాల జంపాల చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్ నటిగా ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం అవికా పలు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments