కాబోయే వ్యక్తిని పరిచయం చేసిన అవికాగోర్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ అవికాగోర్ త్వరలోనే తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టనున్నారు. అవికాగోర్ త్వరలోనే చంద్వాని మిలింద్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు. చంద్వానీ, అవికాగోర్.. ఓ ఎన్జీఓ వర్క్ షాప్‌లో కలుసుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి మరికొన్ని ఎన్జీఓల కోసం పనిచేశారు. చివరకు ప్రేమలో పడ్డారు. చంద్వాని ఎంతో దయగలవాడని, తన జీవితంలోకి చంద్వాని రావడం వల్ల పరిపూర్ణమైందని అవికాగోర్ తెలిపారు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అవికాగోర్ హీరోయిన్గా తెలుగులో ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాలతో విజయాలను అందుకుంది.
మధ్యలో బరువు పెరగడంతో.. సినిమాల నుండి బ్రేక్ తీసుకుని ఫిజిక్‌పై ఫోకస్ పెట్టి సన్నగా తయారైంది. తన లేటెస్ట్ లుక్ చూసిన నెటిజన్స్ అందరూ షాకయ్యారు. ఈ షాక్ నుండి తేరుకోకముందే తన లవ్ మేటర్‌ను అవికాగోర్ రివీల్ చేసి మరింత షాక్‌కు గురిచేసింది. సాధారణంగా మన జీవితంలో మనకు స్ఫూర్తినిచ్చేవారు, జాగ్రత్తలు తీసుకునేవారు, ప్రేమను పంచేవారు దొరకడం కష్టమని చాలా మంది భావిస్తుంటారు. కానీ.. నాకు అలాంటి వ్యక్తి ప్రేమ దొరికిందని అవికా తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments