అతిథి పాత్రలో అవికాగోర్....
Send us your feedback to audioarticles@vaarta.com
స్వామిరారా', 'కార్తికేయ', 'సూర్య vs సూర్య' లాంటి వైవిధ్యమైన కథాంశాలతో సరికొత్త కథనాలతో వరుసగా హ్యాట్రిక్ సూపర్‌హిట్ చిత్రాలతో యూత్‌లో యంగ్ఎనర్జిటిక్ స్టార్ గా ఎదిగిన హీరో నిఖిల్ మరో వినూత్నమైన కథాంశంతో మేఘన ఆర్ట్స్ బ్యానర్‌పై వస్తున్న చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. హేబాపటేల్ నందిత శ్వేత లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 'టైగర్' ఫేం వి.ఐ.ఆనంద్ దర్శకుడిగా తెరకెక్కించారు.
అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను నవంబర్ 11న విడుదల చేస్తున్నారు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ కాదు, ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారట. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ ఫేమ్ అవికాగోర్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనపడుతుందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. అమెరికాలో డైరెక్షన్లో డిప్లొమో కోర్సు చేసిన అవికా ఇప్పుడు సినీ ఎంట్రీ కోసం తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com