అవికా అంటే అంతేనా
- IndiaGlitz, [Thursday,November 26 2015]
'ఉయ్యాలా జంపాలా' సినిమా కోసం హీరోయిన్గా టర్న్ అయిన బుల్లి తెర నటి అవికా గోర్. ఆ తరువాత 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్తా మావ' చిత్రాల్లో నటించింది. రేపు రిలీజ్ కానున్న 'తను నేను'తో నాలుగోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. మొదటి సినిమా నుంచి తాజా సినిమా వరకు అవికా పాత్రలను పరిశీలిస్తే ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
అదేమిటంటే.. తండ్రి చాటు కూతురుగానే సందడి చేయడం. అవికా ఇలాంటి పాత్రలనే ఇష్టపడుతుందో లేదంటే మన వాళ్లు ఇలాంటి పాత్రలకే అవికా బాగుంటుందని భావిస్తున్నారో తెలియదు కానీ.. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం అవికా అంటే ఇలాంటి పాత్రలకు పరిమితమా అని ఆడియన్స్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది.