'అవతార్ 2'...'అవతార్ 3' ఎప్పుడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో 2009లో రూపొందిన విజువల్ వండర్ 'అవతార్'. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా సీక్వెల్స్‌ను సిద్ధం చేస్తున్నారు. పాండోరా గ్రహం.. దానిపై జీవించే నావి తెగ జీవన విధానం.. తమ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు, అక్కడి వారితో కలిసి కథానాయకుడు చేసే సాహసాలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను కొల్లగొట్టింది.
ప్రస్తుతం అవతార్ 2.. అవతార్ 3 చిత్రీకరణ ఒకే సమయంలో జరుగుతుంది. నటీనటులకు సంబంధించిన పెర్ఫామెన్స్ క్యాప్చర్స్ పనులు పూర్తయ్యాయట. అలాగే అవతార్ 4... అవతార్ 5 చిత్రాలకు సంబంధించిన పనులు కూడా నడుస్తున్నాయి.
అయితే 2020లో అవతార్ 2 విడుదలవతుందని ముందు ప్రకటించారు. కానీ ఆలస్యమవుతుందట. దీనికి అనుగుణంగా అవతార్ 3..4..5 సీక్వెల్స్ విడుదల తేదీలు ఫిక్స్ అవుతాయని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments