అవసరానికో అబద్ధం రిలీజ్ కి రెడీ
Monday, August 8, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
లోకేష్, శశాంక్, రాజేష్ ప్రధాన పాత్రలో కె.వి. సురేష్ తెరకెక్కించిన చిత్రం అవసరానికో అబద్ధం. ఈ చిత్రాన్ని చక్రం క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ జె, పులి శ్రీకాంత్, సందీప్ సంయుక్తంగా నిర్మించారు. హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన అవసరానికో అబద్ధం ట్రైలర్ ను ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లాంఛ్ చేసారు.
ఈ ట్రైలర్ కు విశేషం స్పందన లభిస్తుంది. హర్రర్ జోనర్ లో వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో రూపొందింది. ఖచ్చితంగా ఈ చిత్రం ఆడియోన్స్ ను ఆకట్టుకుంటుంది. అందుకనే త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ చిత్రం ప్రీమియర్ షోస్ ను ముఖ్య నగరాల్లో ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నాం అని దర్శకుడు కె.వి.సురేష్ తెలిపారు. ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments